ప్రభాస్ స్వీటీల ప్రేమకు ముగింపెప్పుడు?

VAMSI
అసలు మొదట్లో ఇండస్ట్రీ అంటే పెద్దగా ఆసక్తి లేని ప్రభాస్ పెదనాన్న నటుడు కృష్ణంరాజు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి తన టాలెంట్ తో ఎవరూ ఊహించని అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఈశ్వర్ సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రయాణం నేడు నటుడిగా ఆయన కీర్తి ఖండాలను దాటింది. ఎంతోమంది అందగత్తెల క్రష్ ప్రభాస్ అని చెప్పొచ్చు. మరి డార్లింగ్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు లెండి. టాలీవుడ్ లో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" లిస్టులో ప్రభాస్ ముందుంటారు. అలాంటి ఈ హీరో ప్రేమపై, పెళ్లిపై చాలా రూమర్లే ఉన్నాయి. వాటిలో మొట్ట మొదటగా చూస్తే అనుష్కతో ఆయన ప్రేమ, పెళ్లి అని అనొచ్చు. ప్రభాస్ అంటే చాలు వెంటనే హీరోయిన్ అనుష్క పేరు వినిపిస్తుంది అంతగా వీరి గురించి కదనాలు వెల్లువెత్తాయి.
ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై ప్రభాస్ పలుమార్లు క్లారిటీ ఇచ్చిన ఈ రూమర్లకు మాత్రం ఎండ్ కార్డ్ పడటం లేదు. అసలు అనుష్క ప్రభాస్ పైనే ఇన్ని కథనాలు ఎందుకు వినిపిస్తున్నాయి అనే విషయానికి వస్తే, బేసిక్ ప్రభాస్ చాలా మొహమాటోస్తుడు. హీరోయిన్స్ తో ఆన్ స్క్రీన్ పైన ఉన్నంత సరదాగా కానీ క్లోజ్ గా కానీ ఆఫ్ స్క్రీన్ లో ఉండరు. అసలు షాట్ లేదంటే ఆయన అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటారని పెద్దగా మాట్లాడరని, సిగ్గు చాలా ఎక్కువని ఇండస్ట్రీలో అంటుంటారు. అలాంటి ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కతో మాత్రం కాస్త క్లోజ్ గా ఉంటారట. హీరోయిన్ లతో స్నేహం అంటే కాస్తో కూస్తో ఉన్నది అనుష్కతోనే అని ఫిల్మ్ నగర్ లో టాక్.
ప్రభాస్ కు అనుష్కపై ఇష్టం ఉండటం వలనే ఆయన స్వీటీతో క్లోజ్ గా ఉంటారని అంటుంటారు. ఇది ఒక కారణం అయితే. ఒక హీరో హీరోయిన్ కామిబినషన్ లో ఒకటి రెండు సినిమాలు వస్తేనే వారి మధ్య ఏదో ఉందని వార్తలు షికార్లు చేసాయి. అలాంటిది డార్లింగ్ ప్రభాస్ స్వీటీతో మొత్తం అయిదు సినిమాల్లో చేశారు అందుకే రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇక ప్రభాస్ కి హైట్ లోనూ, అందం లోనూ స్టార్ డం లోనూ  డార్లింగ్  తగ్గ ఈడు జోడుగా అనుష్క కరెక్ట్ గా సూట్ అవుతుందని ఎందరో అభిమానుల అభిప్రాయం. ఇది కూడా రూమర్స్ కి ఒక కారణమే అయిండొచ్చు అని అంటుంటారు.  వీరిద్దరి కాంబో అంటే బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. అలాగే రియల్ లైఫ్ లో కూడా  వీరు ఒకటైతే సూపర్ హిట్టే అని అభిమానుల ఫీలింగ్...ఇలా చాలా కారణాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: