ఆస్కార్ పోటీలో ఆ నాలుగు సినిమాలు ?

Dabbeda Mohan Babu
సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు ను నోబెల్ బ‌హుమ‌తిల గౌర‌విస్తారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా రంగంలో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన వారికి ఆస్కార్ అవార్డు ను ప్ర‌దానం చేస్తారు. ఈ ఆస్కార్ అవార్డు ల‌ను ప్ర‌తి ఏడాది మార్చి నెల‌లో ప్ర‌క‌టిస్తారు. అయితే దీనికి ముందు ఆస్కార్ పోటీ లో ఉంచాల్సిన సినిమాల ను కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేస్తుంది. దేశ వ్యాప్తంగా అన్ని భాషాల్లో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల అయిన సినిమాల్ల‌లో ది బెస్ట్ సినిమా ల‌ను ఎంపిక చేస్తారు. కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన సినిమాల‌ను ఆస్కార్ అవార్డు కమిటీ వాళ్ల కు పంపిస్తారు. అప్పుడు ఆయా సినిమాలు ఆస్కార్ పోటీలో ఉంటాయి. అలా అన్ని దేశాల నుంచి వ‌చ్చిన ది బెస్ట్ సినిమా ల‌ను ఆస్కార్ క‌మిటీ వాళ్ల స్కూటీని చేసి మోస్ట్ బెస్ట్ సినిమా కు ఆస్కార్ అవార్డు ను ప్ర‌క‌టిస్తారు.

అయితే ఈ ఏడాదిగి సంబంధించి 2022 బెస్ట్ ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ విభాగంలో మ‌న దేశం నుంచి అధిక‌రికంగా ఏంట్రి కోసం ప్ర‌స్తుతం నాలుగు సినిమాలు పోటీ ప‌డుతున్నాయి. ఈ సినిమాలను కేంద్ర ప్ర‌భుత్వం 15 మంది స‌భ్యుల‌తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యూరీ ప‌రిశీలిస్తుంది. ఈ సినిమా ల నుంచి ఒక సినిమా ను ఆస్కార్ నామినేష‌న్ కు పంపిస్తారు. అయితే వీటి కోసం ముఖ్యం గా నాలుగు సినిమాలు పోటీ ప‌డుతున్నాయి. హింది నుంచి స‌ర్దార్ ఉద‌మ్ తో పాటు షేర్నీ సినిమాలు పోటీలో ఉన్నాయి. వీటి తో పాటు మండేలా అనే త‌మిళ చిత్రం, నాయ‌ట్టు అనే మ‌ల‌యాళ సినిమా కూడా ముఖ్యం గా ఏంట్రీ కోసం పోటి ప‌డుతున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల నుంచి ఏ సినిమా ను ఆస్కార్ కు జ్యూరీ నామినేష‌న్ చేస్తుందో చూడాలి మ‌రి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: