'నారప్ప'లో చిన్నప్ప గుర్తున్నాడుగా.. డాన్స్ ఇరగదీసాడు?

praveen
మామూలుగా బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. కానీ డాన్స్ నేపథ్యంలో ఏదైనా కార్యక్రమం వచ్చింది అంటే చాలు అది ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇలా తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న అసలు సిసలైన డాన్స్ రియాలిటీ షో ఏది అంటే ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ షో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు 13 ఏళ్ల నుంచి కూడా ఈ టీవీ లో ఢీ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అంతేకాదు ఇక ఈ షో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్లను ఇచ్చింది అని చెప్పాలి. ఒకప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్ గా తన సత్తా నిరూపించుకున్న వారు.. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్లు గా కొనసాగుతున్నారు.

 అయితే ఇక ప్రస్తుతం ఢీ షో చివరి అంకానికి చేరుకుంది  ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్స్  హోరాహోరీగా జరుగుతున్నాయి. కాగా ప్రస్తుతం డాన్స్ విత్ సెలబ్రిటీ అని ఒక రౌండ్ జరుగుతుంది.  అందులో భాగంగా గత వారం ఎపిసోడ్ లో క్వీన్స్ టీం కంటెస్టెంట్స్ అందరూ కూడా వివిధ సెలబ్రిటీలతో డాన్స్ చేసారు. అయితే గత వారం కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఆకట్టుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ సారి నారప్ప సినిమాలో చిన్నప్ప పాత్రలో నటించిన యువకుడు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు...


 వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నారప్ప సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కొడుకు పాత్రలో నటించాడు రాఖి. ఇక తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. పూర్తిగా సినిమా మొత్తం అతని పాత్ర చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇలా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాఖీ ఇక ఇప్పుడు తన డాన్స్ తో కూడా అభిమానులను సంపాదించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఇటీవలే ఢీ షోలో రాఖీ చేసిన డాన్స్ చూస్తే వామ్మో ఇతనిలో ఇంత టాలెంట్ దాగి ఉందా అని అందరూ ఆశ్చర్యపోతారు.

 ఎంతలా అంటే ఢీ షో లో ఉన్న డాన్సర్ తో పోటీపడుతూ అదిరిపోయే స్టెప్పులు వేశాడు  ఇక ఇదే షోలో జడ్జి గా వున్నా ప్రియమణి ఏకంగా నారప్ప సినిమాలో కొడుకుగా నటించిన చిన్నప్ప  డాన్స్ చూసి ఫిదా అయిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: