ఆడెవ‌డ్రా ప్ర‌భాస్ అంటే ప్రాణ‌మిస్తాడ‌ట‌!

RATNA KISHORE
బొమ్మ‌లు ఎవ్వ‌రైనా వేస్తారు. అభిమానం, ప్రేమ ఉంటే ఆ బొమ్మ‌ల స్థాయే వేరు. అంతేకాదు అవి ప్రాణ స్పంద‌న‌ల‌కు ప్ర‌తిరూపంగా ఉంటాయి. మంచి పేరు తెచ్చుకోవ‌డ‌మే కాదు మంచి జ్ఞాప‌కంగా మిగిలిపోతాయి. మారుమూల ప్రాంతాల‌లో ఉన్న క‌ళాకారులెం ద‌రో సినిమా హీరోలంటే ప్రేమాభిమానాలు పెంచుకుంటారు. వారి త‌రఫున సేవా కార్య‌క్ర‌మాలు సైతం చేస్తుంటారు. అయితే ఇక్క‌డో అభిమాని త‌న‌కు తెలిసిన చిత్ర క‌ళ‌కు  కొంత త‌న అభిమానాన్ని జోడించాడు. ప్రేమ‌ను రంగ‌రించాడు. త‌న డార్లింగ్ కు మంచి కానుక ఒక‌టి అందించాడు. పుట్టిన రోజున ప్ర‌భాస్ కు ఎన్ని గిఫ్టులు విషెస్ లూ వ‌చ్చినా కూడా మా ప్రాంతం నుంచి వ‌చ్చిన ఈ బొమ్మే ఆయ‌న‌కు సమ్ థింగ్ స్పెష‌ల్. మా ప్రాంతం అంటే శ్రీ‌కాకుళం అని అర్థం.

లాల్ ప్ర‌సాద్ దాకోజు. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో బొమ్మ‌లు వేసుకుని జీవ‌నం సాగించే ఆర్టిస్టు. చార్కోల్ ఆర్ట్ కూడా తెలుసు. ప్ర‌స్తు తం బ‌న్నీ సినిమా పుష్ప‌కు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్నాడు. ప్ర‌భాస్ ఫ్యాన్. పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌న ర‌క్తంతో ఆయ న బొమ్మ వేశాడు. ఇందుకు కేవ‌లం 5 ఎంఎల్ మాత్ర‌మే అయింద‌ని, ఎవ్వరూ భ‌య‌ప‌డిపోవాల్సిన ప‌నేమీ లేద‌ని అంటున్నా డు. గ‌తంలో సోనూసూద్ బొమ్మ వేసి (చార్కోల్ ఆర్ట్ ) ఆయ‌న మ‌న్న‌న‌లు అందుకున్నాడు.


సోనూ తో పాటు ఎంపీ రామూ కూడా ఎంతో మెచ్చుకున్నారు. ప్ర‌సాద్ కు డిన్న‌ర్ కు సైతం ఆహ్వానించాడు సోనూ. ఇదే కాదు గ‌తంలోనూ చాలా మంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. శ్రీ‌కాకుళం మొద‌లుకుని హైద్రాబాద్ దాకా త‌న ఆర్ట్ తో అంద‌రినీ అల‌రిస్తున్నాడు. త‌న‌కు ప్ర‌భాస్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏద‌యినా కాస్త ప్ర‌త్యేకంగా ఉండాల‌న్న త‌ప‌న‌తో ప్ర‌భాస్ బొమ్మ‌ను ర‌క్తంతో చిత్రించాన‌ని, బొమ్మ వేశాక త‌న‌తో పాటు స్నేహితులు, తోటి ప్ర‌భాస్ అభిమానులు ఎంత‌గానో ఇంప్ర‌స్ అయ్యార‌ని చెప్పాడు. ప్ర‌భాస్ ను క‌లుసుకుని, త‌న ఆర్ట్ ని ఆయ‌కు చూపించాల‌న్న‌దే త‌న కోరిక అని వెల్ల‌డించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: