న‌చ్చిన శివుడు..సాహోరే బాహుబ‌లి ...

RATNA KISHORE
ఇవాళ ప్ర‌భాస్ పుట్టిన రోజు. అభిమానులకు పండుగ రోజు. ఆయ‌న న‌టించిన బాహుబ‌లి సినిమా గురించి నాలుగు మాట‌లు త ప్పక రాయాల్సిందే. భార‌తీయ సినిమా స్థాయి పెంచ‌డంలో రాజ‌మౌళి ఎంతగా కృషి చేశారో అదే స్థాయిలో ప్ర‌భాస్ కొన్నేళ్ల‌పాటు శ్ర‌మించి, త‌న పాత్ర‌కు ఎంత‌గానో న్యాయం చేశారు. అప్ప‌టిదాకా చేయ‌ని పాత్ర, అప్ప‌టిదాకా చేయ‌ని క‌థ..చేయ‌ని జాన‌ర్.. వీట న్నింటికీ మించి ఎదురుగా రాజమౌళి.. ఒక సినిమా జీవితాన్ని మారుస్తుంది అంటారు కానీ ఈ సినిమా జీవితాల‌నే కాదు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న చాలా మంది ఆలోచ‌న‌ల‌ను కూడా మార్చింది. భారీ బడ్జెట్ సినిమా అంటేనే హ‌డలిపోయే నిర్మాత‌ల‌కు ఐదు వం ద‌ల కోట్ల బ‌డ్జెట్ సినిమా అన‌గానే ఇంకెంత వ‌ణుకు పుట్టాలి. వాట‌న్నింటినీ కాద‌ని ప్ర‌భాస్ , రాజ‌మౌళి, రానా చేసిన కృషి ఫ‌లించి ఇండియ‌న్ స్క్రీన్ పై కొత్త వెలుగును తీసుకువ‌చ్చింది.  
బాహుబ‌లి సినిమా అంత‌ర్జాతీయ స్థాయిలో ఖ్యాతి అందుకుంది. జాతీయ స్థాయి అవార్డులు అందుకుంది. తెలుగు సినిమా చరిత్ర నే మార్చింది. మారిన చ‌రిత్ర‌లో మొట్ట‌మొద‌టి పేజీ తన‌దే అని నిరూపించుకుంది. కొత్త చ‌రిత్ర నిర్మాణంలో రాజ‌మౌళి ఎంతో శ్ర‌మిం చారు. ఆయ‌న‌తో పాటే శ్ర‌మించారు ప్ర‌భాస్. రాజ‌మౌళి కోసం ఎన్నంటే అన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చి ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్టులో పూ ర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సినిమా మొద‌టి భాగం లో శివుడిగా అల‌రించిన ప్ర‌భాస్ క‌థలో భాగంగా మ‌హేంద్ర బాహుబ‌లిగా రూపాంత‌రం చెంది రాజ్య ర‌క్ష‌ణ కోసం చేసిన కృషి ఎంతో ఆస‌క్తిదాయకం.


క‌థ‌లో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. వైరుధ్యాలు ఉన్నా యి. మ‌లుపులు ఉన్నా యి. ఆస‌క్తిదాయ‌క మ‌లుపులు ఉన్నాయి. వీట‌న్నింటిలోనూ ప్ర‌భాస్ చ‌క్క‌ని న‌ట‌న ప్ర‌ద‌ర్శించి మంచి పేరు తెచ్చుకు న్నారు. యువ‌రాజుగా అల‌రించాడు. క్ష‌త్రియ ధ‌ర్మం నిర్వ‌ర్తించడంలోనూ, అవంతిక (త‌మ‌న్నా) ప్రేమ పొందడంలో నూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా అంత‌ర్జాతీయ సినిమా వేడుక‌ల్లో మంచి పేరు తెచ్చుకోవ‌డమే కాదు అఖండ కీర్తితో పాటు అవార్డులూ గెలుచుకుంది. ఆన్ స్క్రీన్ వండ‌ర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: