ప్రభాస్ కు భల్లాలదేవుడి గిఫ్ట్... నిజమేనా?
కానీ...ఒకవేళ పంపింది నిజమే అయితే రానా ఏ గిఫ్ట్ పంపుతారు అంటూ ఆసక్తి కనబరుస్తున్నారు ఫ్యాన్స్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు ప్రభాస్. ఈ చిత్రంలో బాహుబలిగా ప్రభాస్ కి ఎంత గుర్తింపు అయితే లభించిందో బల్లాలదేవగా రానాకు కూడా అంతే గుర్తింపు లభించింది. వీరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. బాహుబలి సీక్వెల్ కూడా అంతకు మించిన రికార్డులు క్రియేట్ చేసి విజయాన్ని అందుకుంది. మాములుగానే రానా..ప్రభాస్ కి మంచి స్నేహితుడు ఈ సినిమా తర్వాత వీరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది.
ఆ స్నేహ బంధం తోనే ఇపుడు డార్లింగ్ బర్త్ డే కి ఏదో స్పెషల్ అండ్ కాస్ట్లి గిఫ్ట్ పంపనున్నాడు. అయితే అది ఏదో తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే. కాగా త్వరలోనే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రావాలని ఇద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే స్క్రీన్ పై తలపెడితే ఎలా ఉంటుందో ఇప్పటికే చూశాము. మరి ఇది త్వరలోనే నిజమవ్వాలని ఆశిద్దాం.