"రాదే శ్యామ్" నుండి రేపు సర్ప్రైజ్... నిజమేనా?

VAMSI
2002 లో ఈశ్వర్ చిత్రంతో వెండి తెరకు హీరోగా పరిచయమయిన ప్రభాస్ రెబల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి సత్తా చాటాడు. అంతే కాకుండా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా నలుమూలలకు తన కీర్తిని విస్తరింపచేసి తారా స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఈ హీరో. డార్లింగ్ కి టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ మరియు బాలీవుడ్ లను ఫుల్ క్రేజ్ ఉంది. రేపు డార్లింగ్ బర్త్డే అన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా రెబల్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్  రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ వంటి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాదే శ్యామ్ చిత్రం నుండి ఒక బిగ్ సర్ప్రైజ్ ను చిత్ర బృందం రివీల్ చేయనున్నట్లు సమాచారం. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కీలక పాత్ర పోషించారట, అయితే మొదట ఈ విషయాన్ని డైరెక్ట్ గా తెరపైనే కనబరిచి సర్ప్రైజ్ చేయాలని భావించిన టీమ్ ఇపుడు ప్రభాస్ బర్త్డే సందర్భంగా రివీల్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు మూవీపై మరింత అంచనాలు పెరిగేలా ప్రమోషన్స్ కి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట.
అసలు ఇంతకీ బాలీవుడ్ బిగ్ సెలబ్రిటీ మాట నిజమేనా? నిజమే అయితే ఎవరా స్టార్ హీరో అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా , పూజ హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. రేపు డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: