ప్రకాశ్ రాజ్ కామెంట్స్ పై ఎన్నికల అధికారి రియాక్షన్ ఇది..!

NAGARJUNA NAKKA
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలపై ప్రకాశ్ రాజ్ ఆరోపణలకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఎన్నికల్లో వైసీపీ వ్యక్తి ప్రమేయం ఉందంటూ ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు తన పరిధిలో లేదనీ.. అధ్యక్షుడు మంచు విష్ణు పరిధిలో ఉందన్నారు. అలాగే ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేస్తున్న వ్యక్తులపై యాక్షన్ తీసుకునే నిర్ణయం కూడా మంచు విష్ణుదేనని.. ఎన్నికల నిర్వహణే తన బాధ్యత అన్నారు. తాజా పరిణామాలు తన పరిధిలోకి రావన్నారు.
మా ఎన్నికల్లో వైసీపీ జోక్యం చేసుకుందనీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించాడు. ఎన్నికల హాల్ లోకి ఆ పార్టీ కార్యకర్త సంబశివరావుని ఎలా అనుమతించారని ప్రశ్నించాడు. సీఎం జగన్ తో పాటు మోహన్ బాబు, విష్ణుతో జగ్గయ్యపేటకు చెందిన సాంబశివరావు దిగిన ఫోటోలను ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సాంబశివరావుపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని అన్నాడు. బూత్ లో ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయాలని ప్రకాశ్ రాజ్ అన్నాడు.
మా ఎన్నికల సమయంలో ఓటర్లను బయటివాళ్లు బెదిరించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించాడు. ఈ మేరకు ఎన్నికల అధికారికి ఆయన ఫిర్యాదు సమర్పించాడు. ఏపీలో రౌడీషీట్ ఉన్న వ్యక్తులు కొంతమంది ఓటర్లను బెదిరించినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిిన ప్రకాశ్ రాజ్  ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్ పై గెలిచిన మంచు విష్ణు అధ్యక్ష పదవి కైవసం చేసుకున్నాడు.
మా ఎన్నికలు జరిగిన తీరుపై ఇప్పటికీ ప్రకాశ్ రాజ్ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బయటి వ్యక్తుల పాత్ర ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ తన పరిధిలో లేదని చెప్పడంతో ఆయన కొంత ఆవేదనకు లోనైనట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: