హీరోగానే కాదు పాలిటిక్స్ లో కూడా తనదైన ముద్ర వేసిన కృష్ణ .... ??

GVK Writings
నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తొలిసారిగా తేనెమనసులు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన కృష్ణ, ఆ తరువాత కన్నెమనసులు, గూఢచారి 116, సాక్షి వంటి సినిమాల ద్వారా నటుడిగా పలు సక్సెస్ లు అందుకున్నారు. అనంతరం హీరోగా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుని, వాటిని సక్సెస్ లుగా మలచుకోవడంలో పూర్తిగా సఫలం అయిన కృష్ణ అనతికాలంలోనే సూపర్ స్టార్ గా గొప్ప క్రేజ్ గడించారు. అప్పట్లో అన్న ఎన్టీఆర్ కి పోటీగా యువత, మాస్ ప్రేక్షకుల్లో సూపర్ ఇమేజ్ అందుకున్న కృష్ణ, ఒక ఏడాదిలో 18 సినిమాలు కూడా రిలీజ్ చేసారు.
ఆ విధంగా అందరి నుండి మంచి పేరు అందుకున్న కృష్ణ, అటు రాజకీయాల్లో కూడా పోటీ చేసారు. అప్పటి కాంగ్రెస్ అధినేత రాజీవ్ గాంధీతో మంచి సాన్నిహిత్యం కలిగిన కృష్ణ, అనంతరం ఆయన సహకారంతో కాంగ్రెస్ తరపున ఏలూరు నుండి ఎంపీగా తొలుత పోటీ చేసారు. అప్పట్లో కాంగ్రెస్ తరపున ప్రచారం నిమిత్తం పలు ప్రాంతాలు పర్యటించి ప్రజలకు తమ మ్యానిఫెస్టో, అలానే తాను గెలిస్తే చేయదలచిన కార్యక్రమాలను ప్రజలకు వివరించిన కృష్ణ, అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత ఏలూరు ప్రజలకు ఎంపీగా తన సేవలందించిన కృష్ణ అందరి నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు.
రాజకీయాల ద్వారా ప్రజలతో తాను మరింతగా మమేకం అయ్యే అవకాశం దొరికిందని కృష్ణ చెప్తుంటారు.. తన జీవితంలో సినిమా అనేది విడదీయలేని అనుబంధం అని, ఇక మధ్యలో కొన్నాళ్ల పటు ఎంపీగా రాజకీయాల్లో కొనసాగిన అనంతరం తనకు కొన్ని కారణాల వలన ఇకపై అటువైపు వెళ్ళకూడదు అనిపించిందని పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు కృష్ణ. ఆ విధంగా అటు నటుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు అందుకుని సూపర్ స్టార్ గా నిలిచారు కృష్ణ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: