మహేష్ కి జోడిగా మిస్ ఇండియా భామ..!!

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం  'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని త్రివిక్రమ్ పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అప్ కమింగ్ మిస్ ఇండియా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన 'ఇచట వాహనాలు నిలుపరాదు' అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది మీనాక్షి చౌదరి. ఇక ఆ సినిమాతో మంచి నటనను కనబరిచిన ఈ అమ్మడు.. రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఏకంగా సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఈ మిస్ ఇండియా భామ. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్.. ఈ సినిమా పూర్తయిన తర్వాత వెంటనే త్రివిక్రమ్ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్ల నున్నాడు. ఇక సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.అతి త్వరలోనే ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న మహేశ్ బాబు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: