75 కోట్ల పారితోషికం వైపు పవన్ అడుగులు ?

Seetha Sailaja

ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది ఏప్రియల్ ప్రాంతంలో తన నివాసాన్ని శాస్వితంగా విజయవాడకు మార్చుకుని అక్కడ నుండే తన రాజకీయాలు సినిమాలకు సంబంధించిన ద్విపాత్రాభినయాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నట్లు  ఇప్పటికే వార్తలు వస్తున్నాయి
ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ షూటింగ్ మరో రెండు వారాలలో పూర్తి అవుతుంది అంటున్నారు. ఈమూవీ తరువాత పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ షెడ్యూల్ మిగతా కో ఆర్టిస్టుల డేట్స్ సమస్య వల్ల కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని టాక్.  ఈలోపున హరీష్ శంకర్ దర్శకత్వంలో తన లేటెస్ట్ మూవీని మొదలు పెడదాము అనుకుంటే హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే డేట్స్ ఆలస్యం అవుతున్నాయి అని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితులలో సుమారు ఒక నెల రోజులు ఖాళీగా ఉండటం కంటే మరొక సినిమాను స్పీడ్ గా పూర్తి చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పవర్ స్టార్ కు వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఆమధ్య పవన్ తో సినిమా తీయాలని తీవ్రంగా ప్రయత్నించిన గుంటూరుకు చెందిన ఒక విద్య సంస్థ అధినేతతో పవన్ రాయబారాలు చేస్తున్నట్లు టాక్.

కొత్త స్క్రిప్ట్ కాకుండా ఏదైనా హిట్ అయిన ఒక తమిళ మూవీ రీమేక్ లో నటించడానికి పవన్ ఆశక్తి కనపరుస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయిన విజయ్ ‘మాష్టర్’ మూవీని కొన్ని మార్పులతో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న దిశలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ విషయమై పవన్ ఒక కండిషన్ పెడుతున్నట్లు సమాచారం. ఈమూవీ షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేయాలని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ ద్వారా పవన్  కళ్యాణ్ కు 75 కోట్ల పారితోషికం ఇవ్వడానికి ఈమూవీ నిర్మాతలు రెడీగా ఉన్నారు అన్న  వార్తలుహడావిడి చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: