ఆర్ ఆర్ ఆర్ కు యూట్యూబర్ సపోర్ట్ !

Seetha Sailaja
‘బాహుబలి’ తో రాజమౌళి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుని జాతీయ స్థాయిలో టాప్ సెలెబ్రెటీగా మారాడు. ప్రస్తుతం జక్కన్న తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ తో అతడి ఖ్యాతి మరింత పెరిగి పోతుందని అందరు ఆశిస్తున్నారు. అయితే ఈసారి రాజమౌళి ఆత్మ విశ్వాసంలో ఎక్కడో ఎదో తేడా జరిగినట్లు కనిపిస్తోంది.

దానితో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీ పై తెగ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ఘన విజయం సాదిస్తే తప్ప ఆసినిమాకు ఆశించిన లాభాలు రావు. దీనితో ప్రస్తుతం దేశ రాజకీయాలను దేశ సామాజిక వ్యవస్థను శాసిస్తున్న సోషల్ మీడియా సహాయాన్ని కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబర్స్ హవా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్స్ కు కోట్లలలో ఫాలోయర్స్ ఉండటంతో లక్షలలో ఆదాయం వచ్చిపడుతోంది. అలాంటి వ్యక్తులలో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ప్రముఖ యూట్యూబర్ గా పేరు గాంచిన భువనబమ్ ఒకడు. అతడి లేటెస్ట్ వీడియో ‘డిందోరా’ సోషల్ మీడియాలో సంచలనంగా మారడమే కాకుండా కేవలం కొన్ని రోజులలో కొన్ని కోట్ల వ్యూస్ తెచ్చి పెట్టింది.

సినిమా నటుడుగా మారి కమెడియన్ గా అవుదామని ముంబాయ్ ఎంతోమంది దర్శక నిర్మాతలతో చుట్టూ తిరిగినా సరైన అవకాశాలు రాకపోవడంతో విసుకు చెందిన ఈ యూట్యూబర్ నిరాశ చెందకుండా తనకు తానుగా యూట్యూబర్ గా మారి ఉత్తర భారత దేశంలో తన వీడియోలతో పెను సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఈ యూట్యూబర్ ‘ఆర్ ఆర్ ఆర్’ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకుని చరణ్ జూనియర్ లను ఇంటర్వ్యూలు చేయడమే కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ విశేషాలను ఉత్తర భారతదేశ ప్రజలకు తెలిసే విధంగా ప్రమోట్ చేయడానికి రాజమౌళితో ఒక అవగాహానకు వచ్చినట్లు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: