ఈ వారం టాలీవుడ్‌లో మూడు ముక్క‌లాట..!

VUYYURU SUBHASH
జనజీవనాన్ని అల్లాడించిన మాయదారి కరోనా మహమ్మారి ఎట్టకేలకు శాంతించ్చిన్నట్లుంది.  క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ఎట్ట‌కేల‌కు థియేట‌ర్లు తిరిగి ప్రారంభ మ‌య్యాయి. జ‌నాలు కూడా ఇప్పుడిప్పుడే థియేట‌ర్ల లోకి వ‌చ్చి సినిమాలు చూసేందుకు అల వాటు ప‌డుతున్నారు. అస‌లు క‌రోనా దెబ్బ‌తో జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారా ? అన్న సందేహాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ సందేహాల‌ను నాగ చైత‌న్య - సాయి ప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీ ప‌టాపంచ‌లు చేసింది. ల‌వ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు మంచి వ‌సూళ్లు సాధించింది.
ఇక ల‌వ్ స్టోరీ హిట్ ట్రాక్ కంటిన్యూ చేసే క్ర‌మంలో ద‌స‌రా సంద‌ర్భంగా టాలీవుడ్ కొత్త సినిమాలతో మ‌రింత క‌ళ కళ లాడింది. ఇందులో శ‌ర్వానంద్ - సిద్ధార్థ్ న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ మ‌హాస‌ముద్రం ఫ్లాప్ అయ్యింది. అఖిల్ - పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ హిట్ అయ్యింది. ఎట్ట‌కేల‌కు అఖిల్ ఖాతాలో ఫ‌స్ట్ హిట్ ప‌డింది. అయితే పెళ్లిపంద‌డి ప్లాప్ అయినా కొన్ని ఏరియాల్లో మాత్రం మంచి వ‌సూళ్లే సాధించింది.
ఇక ఈ శుక్ర‌వారం ఏకంగా మూడు సినిమాలు థియేట‌ర్ల లోకి దిగ బోతున్నాయి. కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతున్న నాట్యం సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌మోష‌న్లు కూడా బాగా చేస్తుండ‌గా .. ఈ సినిమాకు రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వ‌హించారు.
ఇక తెలంగాణ‌లో జ‌రిగిన యదార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా అంటూ ప్ర‌చారం జ‌రుగుతోన్న అస‌లేం జ‌రిగింది కూడా వ‌స్తోంది. శ్రీరామ్ క‌థా నాయ‌కుడు. ఇక మ‌ధుర వైన్స్ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూడు సినిమా ల‌తో పాటు ఓటీ టీలో మ‌రో రెండు సినిమాలు వ‌స్తున్నాయి. మ‌రి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హిట్ కొడుతుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: