బాలకృష్ణ లైఫే స్టైల్ ను మార్చిన బ్రాహ్మణి !

Seetha Sailaja
నందమూరి సింహం బాలకృష్ణ టాప్ హీరో అయినప్పటికీ విలాసాలకు ఖరీదైన వస్తువులకు చాల దూరంగా ఉంటాడు. ప్రస్తుతం టాప్ హీరోలు అంతా విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తున్నప్పటికీ బాలయ్య మాత్రం అలాంటి కార్ల జోలికి ఇప్పటివరకు వెళ్ళలేదు. అయితే ఎవరు ఊహించని విధంగా బాలయ్య 4 కోట్లు విలువచేసే విలాసవంతమైన బెంట్లీ కారును ఉపయోగిస్తూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

బాలయ్య ‘ఆహా’ ఓటీటీ లో హోస్ట్ చేయబోతున్న ‘అన్ ష్టాపబుల్’ టాక్ షో షూటింగ్ కు ఈ విలాసవంతమైన కారులో రావడం చూసినవారు షాక్ అయి అసలు విషయం బాలయ్యను అడిగినప్పుడు ఈ ఖరీదైన కారు విషయం నందమూరి సింహం బయటపెట్టినట్లు టాక్. తన పెద్ద కూతురు బ్రాహ్మణి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ ఖరీదైన కారు కు ఆర్డర్ ఇవ్వడంతో ఈమధ్యనే వచ్చిందని దసరా రోజులు మంచివి కాబట్టి దసరా కు పూజలు చేయించి తాను ఆ కారును వాడటం మొదలుపెట్టాను అంటూ చెప్పినట్లు తెలుస్తోంది.

ఆహా లో దీపావళి నుండి స్ట్రీమ్ కాబోతున్న అన్ ష్టాపబుల్ టాక్ షోకు ఎపిసోడ్ కు 40 లక్షలు ఆహా నిర్వాహకులు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 12 ఎపిసోడ్స్ స్ట్రీమ్ కాబోతున్న ఈ షో వల్ల బాలయ్యకు 5 కోట్లు పారితోషికం వస్తుంది అంటున్నారు. ‘అఖండ’ షూటింగ్ పూర్తి కావడంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించబోయే మూవీ నవంబర్ నుండి ప్రారంభం అవుతుంది.

ఈమూవీ తరువాత అనీల్ రావిపూడి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కూడ బాలయ్య సినిమాలు ఉండబోతున్నాయి. 62 సంవత్సరాలు వయస్సు దాటిపోయినా బాలయ్య తన స్పీడ్ ను మరింత పెంచుతూ తన లుక్ విషయంలో కూడ అనేక మార్పులు చేసుకుంటున్నాడు. ఊహించిన విధంగా ‘అఖండ’ సక్సస్ అయితే మళ్ళీ బాలయ్య కెరియర్ కు మంచిరోజులు రావడమే కాకుండా అతడి మార్కెట్ కూడ బాగా పెరిగే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: