ఆలీ ఎలాంటి వాడో చెప్పిన కమెడియన్ శివారెడ్డి..?

Divya
 తెలుగు ఇండస్ట్రీలో మిమిక్రీ కళాకారుడుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటుడు శివారెడ్డి. 120 కి పైగా ఎన్నో సినిమాలలో నటించి.. దేశవిదేశాలలో తన సత్తా చాటుకున్నాడు శివారెడ్డి. ఇప్పటివరకు 4000 పైగా  అనేక ప్రదర్శనలు ఇచ్చాడు శివారెడ్డి. అయితే శివారెడ్డి తాజాగా ఆలీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వివరాలు చూద్దాం.

మొదటిసారిగా సానా మాదిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పిట్టలదొర సినిమాలో మొదటిసారిగా అవకాశం దక్కించుకున్నాడు శివారెడ్డి. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు శివారెడ్డి. ఈయన ఒకవైపు సినిమాలలోనూ రాణిస్తూ మరొకవైపు మిమిక్రీ ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకొని తెలుగువాడి గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో ఉన్నటువంటి నటుల వారి మిమిక్రీ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

మిమిక్రీ తో పాటుగా ఈయన డాన్సులు వేస్తూ అందరి అభిమానాలను పొందారు. దేశ విదేశాల్లో సైతం ఇదే ప్రదర్శనలకు ప్రేక్షకులు బాగా దగ్గరయ్యారు. కానీ ఈ మధ్య కాలంలో శివారెడ్డికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు బాగా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చే వారి సంఖ్య ఎక్కువ కావడంతో అలనాటి స్టార్స్ కమెడియన్ల సైతం నెమ్మదిగా గా తగ్గిపోతూ ఉన్నారు. శివారెడ్డి కి నటన పరంగా చిరంజీవి అంటే చాలా ఇష్టమట.

సినీ ఇండస్ట్రీ లో  ఉన్న హీరోలలో డాన్స్ వేసే వారిలో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్ అంటే మరింత ప్రేమ ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే ఎటువంటి చానల్స్ లో ఎక్కువగా చమ్మక్ చంద్ర, సుడిగాలి సుదీర్ బాగా నచ్చుతాయని చెప్పుకొచ్చాడు శివారెడ్డి. వీళ్లే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఒక్కో కేటగిరిలో  ఒక్కరు నచ్చుతాయని చెప్పుకొచ్చాడు. కానీ అప్పటికీ ఇప్పటికీ కమెడియన్ పరంగా చూసుకుంటే మాత్రం ఆలీ అన్న నాకు మంచి స్నేహితుడు, ఆలీ అన్న అంటే నాకు చాలా ఇష్టం అని కూడా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: