ఇష్టం లేకపోయినా ప్రభాస్ సినిమాల్లోకి ఎందుకు వచ్చాడో తెలుసా..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సినిమా తో ప్రభాస్ ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. టాలీవుడ్ లో 'ఈశ్వర్' సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ఆ తర్వాత మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ నటించిన 'చత్రపతి' సినిమాతో స్టార్ ఇమేజ్ ను కైవసం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. ఈ విషయం పక్కన పెడితే.. ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు.

 ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ప్రభాస్ తండ్రి గురించి మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి ఆయన కూడా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆయన పేరు సూర్య నారాయణ రాజు. అప్పట్లో ఆయన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణం రాజుతో కలిసి గోపి బ్యానర్ మీద ఎన్నో సినిమాలను నిర్మించాడు. సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అదే సమయంలో ప్రభాస్ ను హీరోగా చేయాలి అనుకున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం సినిమాలు చేయాలని ఇష్టం ఉండేది కాదు. ఆ తర్వాత తన పెదనాన్న కూడా సినిమా పరిశ్రమ నుంచి తప్పుకోవాలని అనుకున్నారు.

 ఆయనకు పిల్లలు లేరు. ఈ కారణంగా ప్రభాస్ ను తన నట వారసుడిగా సినిమాల్లోకి తీసుకురావాలి అనుకున్నాడు. ఇదే విషయాన్ని తండ్రి, పెదనాన్న ఇద్దరు ప్రభాస్ కు నచ్చేలా చెప్పారు. వీరి కోరిక మేరకు తనకు సినిమాల్లోకి రావాలని లేకపోయినా సినిమాల్లోకి వచ్చేందుకు ప్రభాస్ అంగీకరించాడు. 'ఈశ్వర్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. ఇక అక్కడి నుంచి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా.. ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. ఈ సినిమాలన్నీ కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: