పూజా నాకు మాత్రమే స్పెషల్ అనుకున్నా : బన్నీ

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది పూజ హెగ్డే. ముకుందా అనే ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.  ఇక మొదటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇక కెరీర్ లో మరిన్ని అవకాశాలు అందుకునేందుకు ఏకంగా గ్లామర్ డోసు కూడా పెంచేసింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో బికినీలో దర్శనం ఇవ్వడంతో దర్శక నిర్మాతలు నిర్మాతలందరినీ కూడా ఆకర్షించడంలో సక్సెస్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది.

 ఇక ఈ హీరోయిన్ ఏ సినిమాలో కనిపిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. దీంతో దర్శక నిర్మాతలకే కాదు హీరోలకు కూడా ఈ అమ్మడు లక్కీ చార్మ్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా సినిమాల్లోకి ఈ ముద్దుగుమ్మనే తీసుకోవాలని ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు  దీంతో ఇక వరుస అవకాశాలు ఈ అమ్మడి చెంత వాలి పోతున్నాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  ఇకపోతే ఇటీవలే అఖిల్, పూజా హెగ్డే కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఇక ఈ సినిమా ప్రేక్షకులందరికీ తెగ ఆకర్షించి మంచి విజయాన్ని సాధించింది. కాగా ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. పూజా హెగ్డే నాకొక్కడికే స్పెషల్ అనుకున్నాను.. కానీ కాదు. తను అందరి హీరోలకి స్పెషలే అంటూ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అన్నాడు .  ముకుంద సినిమా ఆడియో ఫంక్షన్ నాటి నుండి పూజా హెగ్డే ని గమనిస్తూనే ఉన్నా సినిమా సినిమాకి తన నటన ఎంతో  వైవిధ్యంగా మారుతుంది. అంతేకాదు పూజా హెగ్డే ఏ హీరో సినిమాలో నటిస్తే ఆ హీరో హిట్ కొట్టినట్టే అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: