సంక్రాంతి పై ఫోకస్ పెట్టిన కింగ్ నాగార్జున..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ జనాలు సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారో మన అందరికీ తెలిసిందే, సంక్రాంతి పండగ సమయంలో ఎన్ని సినిమాలు విడుదలైన ఆ  ఆ సినిమా రేంజ్ ను బట్టి ఆ సినిమాలకు కలెక్షన్లు వస్తుంటాయి. అందుకే ఆ సమయంలో ఎక్కువ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటాయి. మరియు సంక్రాంతి పండగ సమయంలో ఎక్కువగా స్టార్ హీరోలు బాక్సాఫీసు వద్ద పోటీ పడుతూ ఉంటారు, ఆ సమయంలో చిన్న హీరోలకు థియేటర్ లు దొరకడం కూడా చాలా కష్టం అవుతుంది. అయితే ఈ వాతావరణం వచ్చే సంక్రాంతికి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కనిపించే అవకాశాలు ఉన్నాయి.

 ఇలా ఇప్పటికే సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు , సర్కారు వారి పాట, రెబల్ స్టార్ ప్రభాస్, రాదే శ్యామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ సినిమా లతో సంక్రాంతి బరిలో ఉంటున్నట్లు మొదటగా ప్రకటించారు అయితే అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాను దసరాకు విడుదలను వాయిదా వేసుకొని సంక్రాంతి బరిలో ఉన్నట్లు ప్రకటించారు, దీంతో ఇప్పటికే సంక్రాంతికి విడుదల తేదీలను ప్రకటించిన  సినిమాల్లో కొన్ని సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇలా ఇప్పటికే విడుదల తేదీలను కన్ఫామ్ చేసుకున్న సినిమాలే విడుదల తేదీలను వాయిదా వేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న సమయంలో  కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమాను మాత్రం ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయన సినిమా 2016 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: