సమంత కు హీరోల కరువు !

Seetha Sailaja

సీనియర్ హీరోలకు హీరోయిన్స్ సమస్య ఏర్పడటం ఇప్పటి వరకు కొనసాగిన సమస్య. ముఖ్యంగా బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున చిరంజీవి లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్స్ సమస్య ఏర్పడటంతో వారి సమస్యను తీర్చడానికి దర్శకులు చాల పాట్లు పడవలసి వస్తోంది.

అయితే ఇప్పుడు కొత్తగా సమంతకు హీరోల సమస్య ఏర్పడటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్యతో సమంత విడాకుల వ్యవహారం పూర్తి అయిన తరువాత సమంత తన సినిమాల వేగం పెంచింది. లేటెస్ట్ గా ఆమె అంగీకరించిన ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి హీరో సమస్య ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి.  

యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తీయబడుతున్న ఈమూవీకి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈమూవీ త్వరలో షూటింగ్ ప్రారంభం కావలసి ఉంది. అయితే ఈమూవీలోని హీరో పాత్ర కోసం ఇప్పుడు తీవ్ర అన్వేషణ కొనసాగుతోంది అని టాక్. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి సాధారణంగా హీరోలు ముందుకు రారు. దీనికితోడు సమంతా చైతూల వ్యవహారం తరువాత చాలామంది మీడియం రేంజ్ హీరోలు కూడ సమంతతో కలిసి నటించడానికి పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.

లేదా ఎవరైనా కొత్త హీరోతో ఈ సినిమాను పూర్తి చేయాలి అనుకుంటే సినిమాకు క్రేజ్ ఏర్పడదని దర్శక నిర్మాతల భావన అని తెలుస్తోంది. కోలీవుడ్ కు చెందిన మీడియం రేంజ్ హీరోలు సమంతతో నటించడానికి ఆశక్తి కనపరుస్తున్నా టాలీవుడ్ లో ఈమూవీకి క్రేజ్ ఏర్పడదని ఈ మూవీ నిర్మాతల బాధ ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీలోని దుష్యంతుడు పాత్ర ఎంపికకు కూడ ఇలాంటి సమస్యలే వచ్చాయి.దీనితో మళయాళం సినిమా రంగం నుండి ఓకే హీరోను పట్టుకు వచ్చారు. ఇది ఇలా ఉండగా సమంత తాను నటించే లేటెస్ట్ సినిమాల షూటింగ్ ను హైదరాబాద్ లో కాకుండా చెన్నైలో పెట్టుకోమని తన నిర్మాతలకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో సమంత తన విడాకుల తరువాత చాల కన్ఫ్యూజన్ లో ఉందా అని అనిపించడం సహజం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: