రాజమౌళికి షాక్ ఇస్తున్న టాప్ హీరోల వ్యూహాలు !

Seetha Sailaja
సంక్రాంతి రేస్ కు ప్రభాస్ ‘రాథే శ్యామ్’ పవన్ ‘బీమ్లా నాయక్’ మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను చాల ముందుగా ప్రకటించుకున్నాయి. అయితే ఆతరువాత ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ తమ మూవీ జనవరి 7న విడుదల అవుతుంది అని ప్రకటించడంతో సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ లో చాల మార్పులు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.

అయితే ఈమధ్య జరిగిన కీర్తి సురేష్ పుట్టినరోజునాడు ‘సర్కారు వారి పాట’ టీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ మూవీ జనవరి 13న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి మహేష్ రాజమౌళి సినిమా కోసం త్యాగం చేయడానికి అంగీకరించాడు అంటూ ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా మహేష్ నిర్మాతలు యూటర్న్ తీసుకోవడం దేనికి సంకేతం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే జనవరి 14న విడుదల కావలసి ఉన్న ‘రాథే శ్యామ్’ తన రిలీజ్ డేట్ ను మార్చుకోవడం లేదు అంటూ సంకేతాలు ఇవ్వడంతో రాబోతున్న సంక్రాంతికి రాజమౌళి ప్రభాస్ ల మధ్య వార్ ఉంటుందని భావించారు. ఇప్పుడు మళ్ళీ ‘సర్కారు వారి పాట’ యూటర్న్ తీసుకోవడంతో పవన్ ‘భీమ్లా నాయక్’ పరిస్థితి ఏమిటి అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈమూవీ కూడ జనవరి 12 రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంటే నాలుగు భారీ సినిమాలు విడుదల అయితే అసలు దియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి.

వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియా మూవీ ఈమూవీని దేశవ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో విడుదల చేస్తారు. అనుకున్న విధంగా జనవరి 7న ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయితే తెలుగు రాష్ట్రాలలోని 70 శాతం ధియేటర్లు ఆ సినిమాకే వెళ్ళిపోతాయి. దీనితో ఆ మిగిలిన 30 శాతం ధియేటర్లను మహేష్ ప్రభాస్ పవన్ లు పంచుకుని ఏమి సాధిస్తారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: