ఆ సినిమాలో చిరు పోలీస్ పాత్ర.. అదిరిందంతే?

praveen
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని రకాల సినిమాలు వచ్చినప్పటికీ  పోలీస్ కథ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మాత్రం ఎంతగానో గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు అందరూ ఇక థియేటర్లకు క్యూ కడతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు వరకు  స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు  ఎంతోమంది పోలీస్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు అన్న విషయం తెలిసిందే. ఇలా పోలీస్ పాత్రలో నటించిన స్టార్ హీరోల్లో చిరంజీవి కూడా ఒకరు. సాధారణంగానే చిరంజీవి ఎన్నో పవర్ ఫుల్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ గా మారిపోయారు.

 ఇక మెగాస్టార్ చిరంజీవి పోలీస్ పాత్రలో నటించాడు అంటే చాలు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆ సినిమా చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఒకే సినిమాలో ఓ వైపు రౌడీ పాత్రలో మరో వైపు పోలీస్ పాత్రలో కూడా చిరంజీవి నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న సినిమా ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించి తన త్రిపాత్రాభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా నటిస్తాడు మెగాస్టార్ చిరంజీవి. విధినిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండే పోలీసాఫీసర్గా చిరంజీవి నటన అందర్నీ ఆకట్టుకుంటుంది.

 ఒకానొక సమయంలో ఏకంగా సొంత అన్న నేరస్తుడు అని తెలిసి వెనకా ముందు ఆలోచించకుండా ఏకంగా పోలీస్ పాత్ర లో ఉన్న చిరంజీవి అరెస్టు చేయడానికి వెళ్తాడు.  ఆ సమయంలో చిరంజీవి చెప్పే పవర్ ఫుల్ డైలాగులు అందరినీ ఆకట్టుకుంటాయ్. చిరంజీవి నటించిన పోలీస్ పాత్ర ముగ్గురు మొనగాళ్లు సినిమా లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే మూడు పాత్రల్లో పోలీసు పాత్ర ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.  ఇక ఇప్పటికి కూడా ముగ్గురు మొనగాళ్లు సినిమా వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి సినిమాను వీక్షిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: