యాసలో రాటుదేలుతున్న హీరోలు..!

NAGARJUNA NAKKA
నానికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇమేజ్‌కి తగ్గట్టుగానే ఫ్యామిలీ స్టోరీస్‌ చేసేవాడు నాని. అయితే ఈ మధ్యన కొంచెం ట్రెండ్‌ మార్చి పీరియాడికల్‌ డ్రామాస్ కూడా చేస్తున్నాడు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో 'దసరా' అనే సినిమా చేస్తున్నాడు నాని. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీ కోసం నాని తెలంగాణ యాస కూడా నేర్చుకున్నాడు.
సినిమా సినిమాకి యూనిక్‌ స్టైల్‌లో కనిపించాలనుకునే హీరో అల్లు అర్జున్. క్యారెక్టర్‌కి తగ్గట్లుగా తనని తాను మార్చుకునే బన్ని, 'పుష్ప' కోసం కంప్లీట్‌గా లుక్‌ మార్చేశాడు. రగ్గడ్‌ లుక్‌లోకి వెళ్లిపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చిత్తూరు యాస కూడా నేర్చుకున్నాడు. ఇక ఇంతకుముందు 'రుద్రమదేవి' సినిమా కోసం తెలంగాణ స్లాంగ్‌ కూడా నేర్చుకున్నాడు.
డాన్సులు, యాక్టింగ్‌లో అదరగొట్టే జూ.ఎన్టీఆర్‌ డైలాగ్‌ డెలివరీలోనూ చాలా కేరింగ్‌గా ఉంటాడు. 'అదుర్స్‌'లో చారి క్యారెక్టర్‌తో ఫుల్లుగా నవ్వించిన తారక్, కొత్త కొత్త యాసలు నేర్చుకోవడంలోనూ ముందుంటున్నాడు. 'అరవింద సమేత' సినిమా కోసం జూ.ఎన్టీఆర్ రాయలసీమ యాసలో డైలాగులు చెప్పాడు. ఇక ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్'లో తెలంగాణ మాండలీకంలో మాట్లాడుతున్నాడు. రామ్‌ చరణ్‌కి మాస్ ఫాలోయింగ్‌ ఎక్కువ. బీ,సీ సెంటర్స్‌ని మెప్పించడానికి ఎక్కువగా కమర్షియల్‌ మూవీస్‌లోనే నటిస్తుంటాడు. అయితే ఈ మీటర్‌ నుంచి పక్కకొచ్చి, సుకుమార్‌ దర్శకత్వంలో 'రంగస్థలం' చేశాడు. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్రతో మెప్పించాడు. ఇక ఈ సినిమా కోసం చరణ్‌ గోదావరి యాసలో డైలాగులు చెప్పాడు.
లవ్‌ స్టోరీస్‌తో అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు నాగచైతన్య. ఇక శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేసిన 'లవ్‌ స్టోరి'లో చైతన్య మరో యాంగిల్ చూపించాడు. జుంబా డ్యాన్సర్‌ పాత్ర కోసం కొంచెం కష్టపడ్డాడు. అలాగే ఈ మూవీ కోసం తెలంగాణ యాస కూడా నేర్చుకున్నాడు చైతన్య. మొత్తానికి రకరకాల యాసలతో మన హీరోలు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: