బన్నీ ఫ్యాన్స్ కు షాక్..ఆర్య-3 లో విజయ్ దేవరకొండ..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఇటీవల ఆర్య 3 సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో ఆర్య -3 సినిమాను ప‌ట్టాలెక్కిస్తాన‌ని సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆర్య సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటించగా సీక్వెల్ ఆర్య‌-2 లోనూ ఆయనే హీరోగా నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు అల్లు అర్జున్ కు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. అయితే వీటిలో ముఖ్యంగా ఆర్య సినిమా అల్లు అర్జున్ టాలీవుడ్ లో నిల‌బెట్ట‌గా ఆర్య‌-2 బ‌న్నీ స్టైలిష్ స్టార్ గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది. అల్లు అర్జున్ కూడా ఆర్య సినిమాతోనే సక్సెస్ అయ్యాన‌ని బహిరంగంగా చెప్పారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో సుకుమార్ మాట్లాడుతూ... ఆర్య సినిమాకు సీక్వెల్ గా ఆర్య -3 వస్తుందని చెప్పారు. 

అయితే తాజాగా సుకుమార్ ఆర్య 3 పై ఆసక్తికర వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. సుకుమార్ ఆర్య-3 సినిమా లో విజ‌య్ దేవ‌రకొండ హీరోగా న‌టిస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సుకుమార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థ నిర్వహిస్తోంది. అయితే ఈ సినిమానే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య ఆర్య-2 ల సీక్వెల్ ఆర్య‌-3 గా ఉండబోతుంది అనేది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఆర్య -3 లో విజయ్ దేవరకొండ నటిస్తారన్న దానిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ త్వరలోనే వచ్చే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇక త‌మ అభిమాన హీరో బ‌న్నీ న‌టించిన ఆర్య సిరీస్ ల‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న‌డ‌న్న వార్త బన్నీ అభిమాను షాక్ కు గురిచేస్తుంది. అంతే కాకుండా బ‌న్నీ ఫ్యాన్స్ ఈ వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. తమ హీరోకు ఎంతో క్రేజ్ తెచ్చిన సినిమాలో బ‌న్నీనే నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.  ఇదిలా ఉంటే బ‌న్నీ సుక్కుల కాంబోలో పాన్ ఇండియా సినిమా పుష్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తుండగా ఇటీవ‌లే ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: