ఆ బాలీవుడ్ డైరెక్టర్ కు ఓకే చెప్పేసిన జూనియర్...?
ఈ నేపథ్యంలోనే సంజయ్ లీలా భన్సాలి జూనియర్ ఎన్టీఆర్ తో గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నాడని జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా విషయంలో సంజయ్ లీలా బన్సాలీ తో మాట్లాడే అవకాశం ఉందని సంజయ్ లీలా బన్సాలి గతంలో సంప్రదించిన సమయంలో వద్దన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు.
కన్నడ దర్శకుడు ప్రశాంత్ సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఎంత వరకు ముందుకు వెళ్తున్న ఏంటనే దానిపై క్లారిటీ లేకపోయినా 2025 వేసవిలో ఈ సినిమాను పూణేలో మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ కథ కూడా తెలుసుకున్నారని సినిమాను మొదలు పెట్టడానికి ఏ మాత్రం ఇబ్బంది పడలేదు అని అంటున్నారు.