ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ముగించేసిన ఎన్టీఆర్..!

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ జెమినీ టీవీ లో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఎన్నో అంచనాలతో ప్రారంభం అయిన ఈ షో కు మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. ఇలా మొదటి ఎపిసోడ్ తోనే ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ షో ఆ తర్వాత ఎపిసోడ్స్ లో కూడా ఎన్టీఆర్ వాక్చాతుర్యం వ ల్ల మంచి టీఆర్పీ తో ముందుకు సాగింది. అలాంటి సమయంలోనే ఈ షో  ను మరింత జనాల్లోకి  తీసుకెళ్లి ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకుడు అయిన ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివ  ను రంగంలోకి దించాడు.

వీళ్ళు మాత్రమే కాకుండా సమంత లాంటి టాప్ హీరోయిన్ లను కూడా ఈ షో లో కి తీసుకో వచ్చి ఈ షో క్రేజ్ మరింత పెరిగేలా చేశా రు. ఇది లా ఉంటే ఇప్పటికే షూటింగ్ జరిగిపోయిన మహేష్ బాబు కు సంబంధించిన ఎపిసోడ్ ను ఎవరు మీలో కోటీశ్వరులు నిర్వాహక బృందం దీపావళి రోజున టెలికాస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్  ఎవరు మీలో కోటీశ్వరులు షో ను పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్టీఆర్ నాలుగు షెడ్యూల్స్ ను కేటాయించాడు. నాలుగు షెడ్యూల్స్ లో చిత్రీకరించిన స్టఫ్ ను వారంలో నాలుగు రోజుల చొప్పున టెలికాస్ట్ చేస్తూ వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ చివరి షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అనుకున్న తేదీ కంటే ముందుగానే ఎవరు మీలో కోటీశ్వరులు షో కు సంబంధించిన షూటింగ్ ను జూనియర్ ఎన్టీఆర్ ముగించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: