రామ్ చరణ్, ప్రభాస్ లా ఎన్టీఆర్ ఎందుకు చేయలేకపోతున్నాడు?

P.Nishanth Kumar
నందమూరి తారక రామారావు మనవడిగా హరికృష్ణ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి నందమూరి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ సూపర్ హిట్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అగ్ర దర్శకులతో ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ ప్రయోగాల జోలికి ఏనాడూ వెళ్ళలేదు. ఇతర హీరోలు ప్రయోగాలు చేస్తూ సూపర్ హిట్స్ సాదిస్తుంటే ఎన్టీఆర్ మాత్రం మూస ధోరణి లోనే సినిమాలు చేస్తూ ఉండటం ఓకే రకం సినిమా లు చేసే దర్శకులతో సినిమాలు చేస్తూ ఉండటం నందమూరి అభిమానులకు ఎంతో నిరాశ కలిగిస్తుంది. 

మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలందరూ కూడా విభిన్నమైన సినిమాలను చేస్తూ ప్రయోగాలను చేస్తు తమను తాము నిరూపించుకుంటూ ఉన్నారు.  ఎన్టీఆర్ కూడా నటుడిగా తనను తాను ఎప్పుడూ నిరూపించుకున్న కూడా ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ ను కలిగించే విధంగా సినిమాలు చేయడం లేదు అన్నది మాత్రం నిజం. ఆయన గత పది సినిమాలు కూడా చూస్తే కమర్షియల్ చిత్రాలు యాక్షన్ కథలు పెద్ద దర్శకుల తో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఆయన తోటి హీరోలైన రామ్ చరణ్ మరియు ప్రభాస్ లా ఎన్టీఆర్ భిన్నమైన కథలను ఎంచుకోవడం లేదు.6 పాటలు మూడు ఫైట్లు ఉన్న సినిమా లను మాత్రమే చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తూనే, గౌతమ్ తిన్ననూరి అనే ఓ యువ దర్శకుడు తో కలిసి విభిన్నమైన చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రభాస్ కూడా సలార్ అనే మాస్ యాక్షన్ సినిమాను చేస్తూనే స్పిరిట్ అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్టు కే అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు.  ఈ విధంగా విభిన్నమైన కథలను యాక్షన్ కథలు ఎంచుకుంటూ వారు సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఎన్టీఆర్ మాత్రం అదే యాక్షన్ భరితమైన చిత్రాలను చేయడం ప్రేక్షకులకు కూడా ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పటికైనా ఎన్టీఆర్ లో ఈ మార్పు వస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: