పోలీస్ ఆఫీసర్ పాత్రలకే వన్నె తెచ్చిన పటాస్

P.Nishanth Kumar
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ను నిలబెట్టిన సినిమా పటాస్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ ను అద్భుతంగా చూపించి తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు, అన్నం ఉడికిందా లేదా అని తెలియడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు అన్నట్లు అనిల్ రావిపూడి లో అమితమైన ప్రతిభ ఉందని చెప్పడానికి ఈ సినిమానే ఉదాహరణ. తొలిసినిమా చేస్తున్నారన్న ఎలాంటి భయం కూడా ఈ సినిమాలో కనిపించలేదు అనిల్ రావిపూడి కి.

అద్భుతమైన స్క్రీన్ ప్లే తో పవర్ ఫుల్ డైలాగ్స్ తో పవర్ ఫుల్ యాక్షన్ తో ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కించి తొలి సినిమాతోనే పెద్ద హీరోల కళ్ళల్లో పడ్డాడు అనిల్. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకుడిగా ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఆ విధంగా అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ ను ఈ సినిమాతో గట్టెక్కించి తనకు కూడా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ సినిమా లలో పటాస్ ఒకటిగా నిలిచేలా చేశాడని అని చెప్పవచ్చు. 

అంతకుముందు భారీ ఫ్లాపులు వచ్చినా కూడా పట్టు వదలని విక్రమార్కుడు లా సినిమా ప్రయత్నాలు చేస్తూ వస్తూనే ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఎప్పుడూ విభిన్నమైన కథాంశం మంచి కథలతో సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాలను అదరించలేదు. దాంతో 2015 సంవత్సరంలో రొటీన్ కథే అయినా సరికొత్త స్క్రీన్ ప్లే తో పరిగెత్తించాడు. మాస్ కథనంతో పటాస్ సినిమాను రూపొందించాడు.  దర్శకుడు కొత్త వాడే అయినా కూడా ఆయన కలం బలం నమ్మి సినిమాను ముందుకు తీసుకు వెళ్ళాడు.  ఎక్కడ కూడా గ్రాఫ్ కింద పడకుండా కళ్యాణ్ రామ్ నటించి ఈ సినిమా ను సూపర్ హిట్ చేసాడు అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: