'మా' ఎన్నికల్లో చక్రం తిప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ?

Veldandi Saikiran
మా ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా ఊహించని రీతిలో జరిగిన సంగతి మనందరికీ విధితమే. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి ప్రారంభమైన మా అసోసియేషన్ సభ్యుల వివాదం... మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసి వారం రోజులు దాటినా ఇప్పటికీ ఈ వివాదం ఇంకా చెలరేగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ పాల్పడ్డారని మంచు విష్టు ప్యానల్ పై ప్రకాష్ రాజు ప్యానల్ ఆరోపణలు చేస్తుంటే... తమకు ఎలాంటి సంబంధం లేదని మంచు విష్ణు ప్యానెల్ తేల్చి చెబుతోంది. 

దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ రెండుగా చీలి... ఒకరిపై ఒకరు వివాదాస్పద కామెంట్లు చేసుకుంటున్నారు. ఏదేమై నా 2021 మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ భారీ విజయాన్ని  అందుకుంది. ఇది ఇలా ఉండగా మా అసోసియేషన్ అధ్యక్ష ఎ న్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే జోక్యం ఉందని.. ఆయన పూర్తిగా మంచు విష్ణు ప్యానల్ కు సహకారం అందించాలని సమాచారం అందుతోంది. ఆ ఎమ్మె ల్యే ఎవరో కాదు ఆర్మూరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి చాలా సినిమాలకు ఫైనాన్స్ వ్యవహరిస్తూ ఉంటారు.

అలాగే చాలామంది నటీనటులతో  నిర్మాతలతో చాలా సంబందాలు ఉన్నాయ్. ఈ తరుణంలోనే మంచు విష్ణు ప్యా నల్ తరఫున... రంగంలోకి ఆయన విజయానికి చాలా సహకారం చేశారట ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అయితే టిఆర్ఎస్ అధిష్ఠానానికి తెలియకుం డానే జీవన్ రెడ్డి ... మా ఎన్నికలలో తలదూర్చడానికి సమాచారం అందుతోంది. దీంతో అసలు ఎందుకు జీవన్ రెడ్డి ఇలా చేశాడు అనే దానిపై.. అధి కార టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కొంత మంది నేతలు ఆరా తీస్తున్నారట.  టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఈ పని చేయడ మేంటనే దానిపై పార్టీ నేతల్లో కూడా చర్చ జరుగుతోందట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: