' మా ' వాళ్ల అతితో ఇండ‌స్ట్రీలో వీళ్లు బ‌లైపోయారుగా...!

VUYYURU SUBHASH
ఎప్పుడూ లేనంత రొచ్చు గా మారిపోయింది ఈ సారి మా ఎన్నిక‌ల వ్య‌వ‌హారం. అస‌లే రాజేంద్ర ప్ర‌సాద్ , జ‌య‌సుధ పోటీ చేసిన‌ప్పుడే మా వ్య‌వ‌హారం ర‌చ్చ కెక్కి ఇండ‌స్ట్రీ అంటే నే జ‌నాల‌కు చాలా వ‌ర‌కు ఓ చుల‌క‌న భావం ఏర్ప‌డింది. అయితే ఆ త‌ర్వాత న‌రేష్ వ‌ర్సెస్ శివాజీ రాజా సైతం మా ఎన్నిక ల‌లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ ప‌డిన‌ప్పుడు ఇండ‌స్ట్రీ వాళ్లు ఇంత ద‌రిద్రంగా వ్య‌వ‌హ‌రిస్తారా ? అన్న సందేహాలు చాలా మందికి కలిగాయి. ఇక మొన్న మంచు విష్ణు వ‌ర్సెస్ ప్ర‌కాష్ రాజ్ మా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ ప‌డిన‌ప్పుడు తిట్టుకున్న తిట్లు. గెలుపు కోసం ఎవ‌రికి వారు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం వారిపై వేసిన ఎత్తులు, పై ఎత్తులు, వాడిన నీచ‌మైన భాష‌, చివ‌ర‌కు క‌నీసం చ‌దువు , సంధ్య లేని వాళ్లు కూడా తిట్టుకోలేన‌ట్టుగా తిట్టుకున్న ఘోర‌మైన తిట్టు చూసి తెలుగు జ‌నాలు ముక్కు వేలేసుకున్నారు.

అస‌లు సినిమా వాళ్ల బిహేవియ‌ర్ చూసి జ‌నాలు అస‌హ్యించు కున్నారు. వీళ్ల‌నా తెర‌మీద మ‌నం హీరోలుగా చూస్తోంది అని ఈస‌డించుకున్నారు. అయితే మా ఎన్నిక‌లు ముగిశాక కూడా ఇప్పుడు ఎవ‌రికి వారు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం , ఒక‌రి అంతు మ‌రొక‌రు చూస్తాన‌న‌డం మాత్రం మాన‌లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మా దెబ్బ‌తో సాధార‌ణ‌, సామాన్య ఆర్టిస్టులు బ‌లై పోయేలా ఉన్నారు. మొన్న ఎన్నిక‌ల్లో మంచు విష్ణుకు వ్య‌తిరేకంగా ప్ర‌కాష్ రాజ్ కు స‌పోర్ట్ చేసిన వారికి విష్ణుకు ప‌నిచేసిన వ‌ర్గం వారి సినిమాల‌లో అవ‌కాశాలు రావ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే విష్ణుకు స‌పోర్ట్ చేసిన వారికి మెగా కాంపౌండ్ ల‌లో ఛాన్సులు రావ‌ని అంటున్నారు.

ఇక ఇండ‌స్ట్రీలో క‌మ్మ‌, కాపుల కులాల మ‌ధ్య విభ‌జ‌న రేఖ స్ప‌ష్టంగా క‌న‌ప‌డ‌డంతో పెద్ద హీరోల‌కు, వారి సినిమాల‌కు వ‌చ్చిన ఇబ్బంది లేక‌పోయినా సాధార‌ణ‌, సామాన్య ఆర్టిస్టులు మాత్రం అవ‌కాశాలు రాక న‌లిగి పోయే ప‌రిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: