ఎన్టీఆర్ ఫ్రెండ్ మహేష్ కోనేరు మరణించడం వెనుక ఇంత కథ ఉందా..?

Divya
మొదటిగా జర్నలిస్టుగా తన కెరీర్ ని ప్రారంభించారు మహేష్ కోనేరు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే కొంతమంది సినీ నటులకు PRO గా, ప్రొడ్యూసర్ గా ఎదిగిపోయారు మహేష్ కోనేరు. తన జీవితం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వచ్చేలా మారిపోయింది అతని జీవితం. మొదటిసారిగా రాజమౌళి మొదలు పెట్టిన వెబ్ సైట్ కోసం పని చేయడం మొదలు పెట్టాడు.

ఆతర్వాత బాహుబలి సినిమాకు కూడా PRO గా వర్క్ చేయడం జరిగింది.ఇది ఈయన కెరీర్ ఒక్కసారిగా మార్చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు మహేష్ కోనేరు. సినీ నటి లో ఉన్నటువంటి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలకు ఆప్తమిత్రుడు అయ్యాడు ఈయన. వారం కిందట ఈయన గుండెపోటుతో మృతి చెందడం జరిగింది.
మహేష్ కోనేరు నిర్మాతగా నిర్మించిన సినిమాలలో..118, తిమ్మరుసు, మరి కొన్ని సినిమాలను తెరకెక్కించడంలో జరిగింది. ఇందులో కొన్ని సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. ఇక అంతే కాకుండా టాలీవుడ్ లోనే యువ హీరోలలో సందీప్ కిషన్, నాగ శౌర్య, అల్లరి నరేష్ తో కూడా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఇక ఈయన మరణానికి ముఖ్య కారణం ఒక విషయం ఉన్నట్లుగా సమాచారం.
ఈయనకు దాదాపుగా 80 కోట్ల రూపాయల వరకు అప్పు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఒక మంచి వ్యక్తి కావడం చేతనే.. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి ప్రొడ్యూసర్లు, జర్నలిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు మహేష్ కోనేరును నమ్మి అప్పు ఇచ్చినట్లుగా సమాచారం. ఇక్కడ గమనించదగ్గ విశేషమేమిటంటే ఆయన తీసిన ఏ సినిమాలు కూడా ఆయనకు నష్టాలను వివరించి లేదట. మహేష్ కు చెడ్డ అలవాట్లు కూడా లేవు, దీంతో ఆయన మరణించడంతో ఆయనకి డబ్బులు ఇచ్చిన వారు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ఒకే సారి అన్న 80 కోట్ల రూపాయలను ఏం చేశాడని విషయం ఎవరికీ అర్థం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: