అందరినీ ఆకట్టుకున్న "అంజి" !

Veldandi Saikiran
మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వచ్చాయి.. ఇంకా కూడా వివిధ కథాంశంతో వచ్చిన సినిమాలు వస్తున్నాయి. లవ్ స్టోరీ లు, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అలాగే దేవుడిని కథాంశంగా చేసుకొని కొన్ని సినిమాలు వచ్చాయి. ఇలా దేవుడు కథాంశంతో వచ్చిన సినిమాలు.. వందకు తొంభై శాతం బాగా ఆడినవి ఎక్కువ ఉన్నాయి. ఈ కోవలోకే వస్తుంది మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా. 2014 సంవత్సరం లో కోడి రామకృష్ణ దర్శకత్వం లో... అంజి సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించగా ఎంఎస్ ఆర్ట్ మూవీస్ పతాకంపై ఈ సినిమా  తెరపై కనిపించింది. 

జై సినిమాలో హీరోగా చిరంజీవి నటించగా మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించింది. చోటా కె.నాయుడు ఛాయాగ్రహణం బాధితులు వహించగా కె వి కృష్ణారెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు చాలా చక్కగా చేశారు. ఇక ఈ  సినిమాకు మణిశర్మ సంగీత స్వరాలు అందించారు. ఇక ఈ కథ విషయం లోకి వెళితే... ఈ సినిమా పూర్తిగా ఆకాశ గంగా చుట్టూ తిరుగుతుంది. ఆకాశగంగను తాకితే.. ముసలి వాళ్లు మళ్లీ... యువత గా మారి పోతారు. ... వారి శక్తికి అంతం లేకుండా పోతుంది.. అలాగే మరణం కూడా సంభవించదు.

 దీనికోసం... చిరంజీవి మరియు విలన్ ల మధ్య జరిగే సంఘటనలు దర్శకులు కోడి రామకృష్ణ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా  బాక్సాఫీస్ ముందు మాత్రం బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా కు 2 నంది పురస్కారాలు వచ్చాయి. ఉత్తమ ఛాయాగ్రాహకుడు చోటా కె నాయుడు కు అలాగే కే.వి తమ మేకప్ ఆర్టిస్ట్ గా చంద్రరావు కు నంది పురస్కారాలు వచ్చాయి. డిజాస్టర్ అయినప్పటికీ ఇప్పటికీ అంజి సినిమా మెగా ఫ్యాన్స్ మదిలో ఓ చిరస్మరణీయ సినిమాగా ఉండి పోతుం ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: