భార్యపై కృష్ణ వంశీ కి నమ్మకం లేదా...? అందుకే ఆ ఛాన్స్ అటు వెళ్లిందా...?

Sahithya
టాలీవుడ్ లో రమ్యకృష్ణకు ఉన్న గుర్తింపు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రమ్యకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని కీలక పాత్రలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఏడాది రమ్యకృష్ణ రెండు మూడు సినిమాల్లో కనపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన సినిమాలన్నీ కూడా అగ్ర హీరోల సినిమాలు కావడం అదే విధంగా ఆమె సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఆమెకు పారితోషకం కూడా ఎక్కువగానే ఇవ్వడానికి సిద్ధమౌతారు అనే విషయం కూడా తెలుస్తోంది.
అయితే రమ్యకృష్ణ ఒక మంచి ప్రాజెక్టు చేసేందుకు ఆమె భర్త కృష్ణవంశీ రెడీ అవుతున్నారని ప్రచారం కూడా మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కథను కూడా కృష్ణవంశీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నారని త్వరలోనే దీనికి సంబంధించి ముందుకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆ పాత్రను ఆమె చేస్తుందా లేదా అని అనుమానంతో కుష్బూనీ సంప్రదించారని అంటున్నారు. ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా చేయగల రమ్యకృష్ణ ఆ పాత్రను చేసే విషయంలో కాస్త  అనుమానం వ్యక్తం చేశారు అని కూడా అంటున్నారు. అందుకే ఆ పాత్ర కోసం  ఖుష్బూ  ని సంప్రదించారని తెలుస్తోంది.
ఆ సినిమాలో ఖుష్బూ చేయబోయే పాత్ర కాస్త భయంకరంగా ఉంటుందని కాబట్టి ఆ పాత్రను రమ్యకృష్ణ చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయని అందుకే కృష్ణవంశీ భార్యను కాదని ఖుష్బూ అవకాశం ఇచ్చారని అంటున్నారు. ఇటీవల రమ్యకృష్ణ నటించిన రిపబ్లిక్ సినిమాకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఆ సినిమా కాస్త మంచి వసూళ్లు సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రమ్యకృష్ణ మహేష్ బాబు చేయబోయే తర్వాత సినిమాలో అలాగే జూనియర్ ఎన్టీఆర్ చేసే తర్వాత సినిమాల్లో కూడా కనపడే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: