టాప్ హీరోలకి చెల్లిగా మారిన కీర్తి సురేష్...

NIKHIL VINAY
నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి కి మొదటి సినిమా సూపర్ హిట్ అయిన కూడా సినిమాలో చాలా డల్ గా కనిపించింది అని కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ కామెంట్స్ అన్ని ఆమె నేను లోకల్ సినిమాతో తిప్పి కొట్టింది. పాత్రని బట్టి ఆమె నటన ఉంటుంది అని ఆమె నిరూపించింది. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే తమిళంలో కూడా కీర్తి స్టార్ హీరోయిన్ గా మారింది. పవన్ కళ్యాణ్ , విజయ్ ఇలా తెలుగు తమిళ సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసి సౌత్ టాప్ హీరోయిన్ గా కీర్తి పెరు తెచ్చుకుంది. అలాగే పాత్ర నచ్చితే హీరోయిన్ గానే కాకుండా ఎలాంటి పాత్రలోనైన కీర్తి నటించడానికి సిద్ధంగా ఉంటుంది.

అలా ఈ మద్యనే సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా అన్నతే లో కూడా హీరోయిన్ ఆమె కాకపోయినా సూపర్ స్టార్ చెల్లి గా ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. తమిళ మాస్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ లో కూడా కీర్తి కి చెల్లిగా కనిపించబోతుంది. ఈ మద్యనే రాఖీ పండగ రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు మూవీ టీం. అలా కీర్తి స్టార్ హీరోలకి చెల్లిగా మారి ఎలాంటి పాత్రని అయిన చేయగలను అని నిరుపేస్తుంది.అలాగే హీరోయిన్ గా కూడా ఆమె ఇప్పుడు టాప్ రేసులో ఉంది .

ఒక పక్క మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తూ ఇంకోపక్క తమిళంలో ధనుష్ సినిమాలో కూడా కీర్తి అలరించబోతుంది. ఇలా వరసగా పెద్ద హీరోల సినిమాలతో కీర్తి క్యాలెండర్ అంత నిండిపోయింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: