తగ్గేదే లే... "రుద్రమదేవి" కొత్త రికార్డు

Vimalatha
గుణశేఖర్ అద్భుతమైన చారిత్రాత్మక చిత్రం, యుద్ధ నాటకం 'రుద్రమ దేవి'. ఈ చిత్రం విడుదలై చాలా ఏళ్ళు గడుస్తోంది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ దూసుకెళ్తోంది. ఇన్నేళ్ల తరువాత కూడా కొత్త రికార్డులు తన పేరు మీద క్రియేట్ చేసుకునే పనిలో పడింది 'రుద్రమ దేవి'. ఇప్పటికీ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటోంది. 2015లో విడుదలైన చారిత్రక నాటకం 'రుద్రమదేవి'కి మిశ్రమా స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ యూట్యూబ్‌ లో భారీ విజయం సాధించింది. తాజా నివేదిక ప్రకారం ఈ ధైర్యావంతురాలైన రాణి జీవితం పై తెరకెక్కిన తెలుగు సినిమా 'రుద్రమ దేవి' హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో 200 మిలియన్ + వ్యూస్ దాటి రికార్డు సృష్టించింది.
'రుద్రమ దేవి'లో ముగ్గురు అగ్ర తారలు ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి ఇందులో నటించారు. అల్లు అర్జున్ గోన గన్నా రెడ్డి పాత్రలో కనిపించగా, రాణా దగ్గుబాటి చాళుక్య వీర భద్రుడుగా కనిపించాడు. ఇక అనుష్క రుద్రమ దేవి. సినిమా కథ, కథనం బాగున్నప్పటికీ గ్రాఫిక్స్ వల్ల సౌత్ లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలైన తర్వాత మంచి విజయాన్ని సాధించింది.
అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించడానికి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. 'రుద్రమ దేవి'లో కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, సుమన్, నిత్యా మీనన్, ఆదిత్య, కేథరీన్ ట్రెసా కూడా ఉన్నారు. ఈ చిత్రానికి చిరంజీవి కథ అందించారు. సౌండ్‌ట్రాక్, నేపథ్య స్కోర్ ఇళయరాజా స్వర పరిచారు. అనుష్క శెట్టి నటించిన 'రుద్రమ దేవి' 2015 అక్టోబర్ 9న హిందీ, మలయాళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 2015 లో విడుదలైన భారతీయ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ చిత్రంగా ఇది నిలిచింది. మరో వైపు అనుష్క శెట్టి చివరి సారిగా 'నిశబ్ధం'లో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: