పెద్దన్న‌గా తెలుగు ప్రేక్ష‌కుల ముందు కు వ‌స్తున్న ర‌జిని

Dabbeda Mohan Babu
కోలీవుడ్ తో టాలీవుడ్, బాలీవుడ్ ప్ర‌జ‌ల‌కు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేరు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న మార్క్ న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు ర‌జిని. ఆయ‌న సినిమా లో కోలీవుడ్ లో ఎంత హిట్ అవుతాయో తెలుగు భాష లో కూడా అంతే హిట్ ను అందు కుంటాయి. ఎంత వ‌య‌స్సు వ‌చ్చినా త‌న న‌ట‌న‌లో గ్రెస్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. త‌న వ‌య‌స్సు కు అనుగూణంగా సినిమా లు తీస్తు తెలుగు తో పాటు త‌మిళ భాష ప్ర‌జ‌ల అభిమానుల‌ను సొంతం చేసుకుంటున్నాడు. అయితే ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ అన్నాత్తై అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు.

 శివ దర్శకత్వంలో రూపొందుతున్న అన్నాత్తై యాక్షన్ డ్రామా చిత్రం గా తెర కెక్కుతుంది. అయితే సూప‌ర్ స్టార్  రజినీకాంత్ కు ఒక త‌మిళ్ ల‌నే కాకుండా దేశవ్యాప్తంగా విప‌రీత‌మైన‌ క్రేజ్ ఉంది.  అందు కోసం ఆయ‌న సినిమా ను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయాల‌ని  చిత్ర బృందం ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ అన్నాత్తే సినిమా ను  తెలుగు కూడా విడుద‌ల చేస్తున్నారు. అయితే విజ‌య‌ద‌శ‌మి సందర్భంగా ఈ సినిమా తెలుగు టైటిల్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. తెలుగు లో పెద్ద‌న్న గా టైటిల్ ను పెట్టారు. అలాగే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో ర‌జినీ కాంత్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై క‌త్తి ప‌ట్టుకుని వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో న‌య‌న తార ర‌జ‌నీ కాంత్ కు జోడీ గా న‌టిస్తుంది. అలాగే మ‌హా నటీ కీర్తి సురేష్ రజినీ కాంత్ కు సోదరిగా కనిపించనుంది. వీరి తో పాటు సీనియర్ హీరోయిన్లు మీనా, ఖుష్బు ఈ సినిమాలో ప‌లు కీలక పాత్రల‌ను పోషిస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా దీపావళి సందర్భంగా నవంబర్ 4 న విడుద‌ల అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: