రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దీపావళి కి అదిరిపోయే కానుక ఇవ్వనున్న రాజమౌళి..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో సముద్ర ఖని, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు, ఇప్పటికే ఈ సినిమా  విడుదల కావాల్సి ఉండగా దేశంలో ఏర్పడిన కరోనా పరిస్థితులవల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కూడా అప్పట్లో చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించారు కానీ చివరగా ఈ తేదీన కూడా ఈ సినిమా విడుదల కాలేదు. అయితే ఎట్టకేలకు  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది.

 ఈ సినిమాలో లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించ నుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల కు సంబంధించిన ప్రోమో లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి నుండి మంచి స్పందన వచ్చింది, మరియు దోస్తి అని ఒక ప్రమోషన్ సాంగ్ ను కూడా విడుదల చేసిన చిత్ర బృందం ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచే చేసింది.
 ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఇప్పటికే పోస్టర్ లతో,  ప్రోమో లతో, ప్రమోషనల్ సాంగ్ లతో జనాలలో ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్ర బృందం  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను దీపావళి కానుకగా విడుదల కు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: