'రామ్ చరణ్ - ప్రశాంత్ నీల్' సినిమా కథ ఇదేనా..?

Anilkumar
మెగా ఫ్యాన్స్ కి దసరా రోజున అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు రామ్ చరణ్.కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తాను ఓ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇదిలా ఉండగా చరణ్, ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న సినిమా కథ గురించి ఇక తాజా అప్డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.గతంలో పాకిస్థాన్ - ఇండియా మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట.అయితే విచిత్రం ఏమిటంటే చరణ్ ఈ సినిమాలో ఒక పాకిస్థానీగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.తన పూర్వీకులు హిందువులు కావడం...

 తనకు ఇండియా అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండటం కారణంగా ఇండియా గెలుపు కోసం చరణ్ పాత్ర ఎలాంటి త్యాగం చేసాడనే కోణంలో ఈ సినిమా సాగుతుందట.పైగా ఆ యుద్ధ నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం.పైగా ఈ సినిమా కోసం వచ్చే ఏడాది చరణ్ దాదాపు 80 రోజుల పాటు బల్క్ గా డేట్స్ కేటాయించబోతున్నాడు.ఇక ఈ సినిమాని 2022 లో సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.అంతేకాదు అదే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ నిర్మాతలు సైతం ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా కొందరు నిర్మాతలు అయితే భారీగా అడ్వాన్స్ లు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.ఈ క్రమంలోనే ఆర్ ఆర్ ఆర్ నిర్మాత అయిన దడీవీవీ దానయ్య ఇప్పటికే ప్రశాంత్ నీల్ కి అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే పాన్ ఇండియా సినిమాకి దానయ్య నిర్మాత అని తెలుస్తోంది.ఇక ఇప్పటికే దానయ్య వరుస పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఇక చరణ్ తో దానయ్య ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా చేసిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు మరోసారి చరణ్ సినిమాని దానయ్య నిర్ముస్తుండటం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: