BB5 : ఈ వారం శ్వేతా వర్మ ఎలిమినేట్ కానుందా ..!!

Surya
బిగ్ బాస్ సీజన్ 5 స్టార్టింగ్ నుండి దూసుకు పోతూ ఉంది . ఇప్పటివరకు మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది . బిగ్ బాస్ లో ఇంటి సభ్యులు అందరూ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఈ వారం వీక్ ఎండ్, డెడ్ ఎండ్ రానే వచ్చింది అదేనండి ఇంటిసభ్యుని ఎలిమినేషన్. ఈ వారం ఎలిమినేషన్ లో షణ్ముఖ్ , జస్వంత్, సన్నీ, రవి, లోబో , శ్వేతా, సిరి, ప్రియాంక, విశ్వా మరియు మానస్ లు ఉన్నారు . శ్వేతా ఇప్పటికే వరస్ట్ ఫెరఫార్మర్ గా జైలు కి వెళ్ళింది. అయితే వీకెండ్ రావడంతో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జరిగిన ఓటింగ్స్ లో లీస్ట్ లో శ్వేతా , లోబో , విశ్వా లు ఉన్నారు, శ్వేతా బెటర్ పొజిషన్ లో ఉన్నప్పటికీ ఫైనల్ రిసల్ట్స్ మాత్రం శ్వేతా ఎలిమినేట్ కావొచ్చని చెబుతున్నాయి.
హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎవరన్నా ట్రిగ్గరింగ్ చేస్తే ఇచ్చిపడేస్తానని చెప్పింది. హౌస్ లోకి వెళ్లిన నాటి నుండి ఇప్పటివరకు కచ్చితంగా , ముక్కుసూటిగా మాట్లాడుతూ వచ్చింది. నాగార్జున శ్వేతను ఆ విషయం లో మెచ్చుకున్నారు కూడా. ఈ వారం ఎలిమినేషన్ రానే వచ్చింది. తాజాగా రిలీజ్ ఐన ప్రోమో శ్వేతను ఎలిమినేషన్  ని ఇండికేట్ చేస్తున్నాయి. కానీ వోటింగ్ ప్రకారం లీస్ట్ లో ఉన్న లోబో కానీ విశ్వా కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆలా జరిగితే శ్వేతా సేఫ్ అయ్యినట్లే. ఈ వారం బయటకు వచ్చిన ఓటింగ్ ప్రకారం షణ్ముఖ్ , జస్వంత్ లు టాప్ ఉన్నారు. ఈ వారం రవికి ఓట్లు తక్కువ గానే పోలయ్యాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ రసవత్తరంగా ఉండ బోతుంది. గత వారం లో ఊహించని విధంగా హమీద ఎలిమినేట్ అయ్యింది. అప్పటినుండి శ్రీరామ్ పని వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్లుగా తయారయ్యింది . ప్రస్తుతం హౌస్ లో త్రిమూర్తుల ప్రస్థానం నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: