పెళ్లి సంద‌D అంచ‌నాల‌ను అందుకుందా?

Dabbeda Mohan Babu
ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర రావు ప‌ర్య‌వేక్ష‌ణ లో గౌరీ రోనంకి ద‌ర్వ‌కత్వంలో తాజాగా వ‌చ్చిన చిత్రం పెళ్లి సంద‌D. 1996 లో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావు ద‌ర్వ‌క‌త్వంలో హీరో శ్రీ‌కాంత్ మేక తో తీసిన పెళ్లి సంద‌డి సినిమా కు సిక్వెల్ గా ఈ పెళ్లి సంద‌D అనే సినిమా ను తెర కెక్కించారు. అయితే శ్రీ కాంత్ హీరోగా పెళ్లి సంద‌డి సినిమా ఆ రోజుల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌ల అయింది. కాని ఈ సినిమా వాణిజ్య ప‌రంగా పెద్ద హిట్ ను అందుకుంది. ఈ సినిమా ను ఆ రోజుల్లో కేవ‌లం రూ. 85 ల‌క్ష‌ల బ‌డ్జెట్ తో తీశారు. కానీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద రూ. 15 కోట్ల క‌లెక్ష‌న్ ను సాధించింది. అంత పెద్ద విజ‌యం సాధించిన సినిమా కు తాజాగా సిక్వెల్ తీశారు. అందులో కూడా హీరో శ్రీ కాంత్ కొడుకు అయిన రోహ‌న్ మేక ను హీరోగా ఎంచుకున్నారు. అయితే ఈ సినిమా అంచనాల‌ను అందు కుందో లేదో చూద్దం.


ఈ సినిమా లో  హీరో హీ రోయిన్లు గా రోష‌న్ మేక‌, శ్రీ లీల న‌టించారు. క‌థ లోకి వ‌స్తే హీరో రోష‌న్ అన్న పెళ్లి లో  హీరోయిన్ శ్రీ లీల ను చూసి ఇష్ట ప‌డుతాడు. ఆమెను ఎలాగైన ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌ని రోష‌న్ అనుకుంటాడు. కానీ వీరి పెళ్లి జ‌ర‌గ కుండా కొన్ని అడ్డంక‌లు వ‌స్తాయి. వాటిని ఎదుర్కొని చివ‌రికి ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ సినిమా లో రోష‌న్ మేక త‌న పాత్ర కు న్యాయం చేసినా ఆక‌ట్టు కోలేక పోయాడు. అలాగే హీరోయిన్ శ్రీ లీల గ్లామ‌ర్ సినిమా కు కాస్త ప్ల‌స్ అయింది. అలాగే ఈ సినిమా లో కాస్త కామెడీ పండిచాల‌ని ప్ర‌య‌త్నించినా అది వ‌ర్క్ అవుట్ కాలేక పోయింది. అలాగే ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర రావు స్టైల్ కొన్ని సీన్స్ ఉన్నా అవి కూడా పెద్ద‌గా ఆక‌ట్టు కోలేక పోయాయి. మొత్తంగా పెళ్లి సందడి వంటి సూప‌ర్ హిట్ సినిమా కు సిక్వెల్ గా వ‌చ్చిన ఈ పెళ్లి సంద‌D అంచ‌నాల‌ను పూర్తిగా అందు కోవ‌డం లే కాస్త స్ట్ర‌గుల్ అయింది అనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: