బ‌న్నీ కెరీర్‌లో పుష్ప మ‌రో బిగ్గెస్ట్ రికార్డ్‌.. దుమ్ము లేపిందిగా...!

VUYYURU SUBHASH
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా పుష్ప‌. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచే ఊహించ‌ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పుష్ప పాన్ ఇండియా సినిమాగా ఐదు భాష‌ల్లో వ‌స్తోంది. ఇక పుష్ప‌ను పార్ట్ 1, 2 లుగా రిలీజ్ చేస్తున్నారు. సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ తో 2018 లో తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు పుష్ప సినిమా చేస్తున్నాడు.
ఇక అటు అల్లు అర్జున్ సైతం గ‌త సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుర ములో సినిమా త‌ర్వాత పుష్ప చేస్తున్నాడు. అల వైకుంఠ‌పురం టాలీవుడ్ లో నాన్ బాహుబ‌లి రికార్డులు అన్నింటికి పాత రేసేసింది. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో త‌న స‌త్తా ఏంటో చాటాల‌ని బ‌న్నీ క‌సితో ఉన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టు గానే పుష్ప‌ను ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా బ‌న్నీ కెరీర్ లోనే మ‌రో బిగ్గెస్ట్ రికార్డుకు రెడీ అవుతోన్న ప‌రిస్థితి.
కేవ‌లం ఇండియా వైడ్ గా పుష్ప‌ను భారీగా రిలీజ్ చేయ‌డంతో పాటు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా పుష్ప ను భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప సినిమా రిలీజ్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్‌ రిలీజ్ గా ఉంటుంది అని మేక‌ర్స్ చెపుతున్నారు. డిసెంబ‌ర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే ఓవ‌ర్సీస్ లో మాత్రం డిసెంబర్ 16 నుంచే ప్రీమియర్స్ తో పుష్ప ర‌చ్చ అక్క‌డ షురూ కానుంది. ఇక పుష్ప 1 త‌ర్వాత పుష్ప 2 ను ఆరు నెల ల గ్యాప్ లో రిలీజ్ చేయ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: