BB5: ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ కోసం పోటీపడ్డ ఆ ఇద్దరు !!

Surya
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మంచి రేటింగ్స్ తో ముందుకు దూసుకు పోతుంది. ఈ వారం కెప్టెన్ గా విశ్వా గెలిచాడు. విశ్వా కెప్టెన్ అవ్వడం ఇది రెండవసారి. కెప్టెన్ టాస్క్ లో అందరూ హోరాహోరీగా పోటీపడ్డారు. అనూహ్యంగా రవి టీమ్ ఎలిమినేట్ కావడం తో బ్లూ టీమ్, రెడ్ రామ్ టీమ్ లు కెప్టెన్ పోటీదారులుగా ఎన్నికయ్యారు. గేమ్ లో ఎక్కువ ఇసుకని డబ్బాల్లో నింపి విశ్వా కెప్టెన్ అయ్యాడు. ఇకపోతే ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ కోసం పెద్దపోటినే నెలకొంది.

కెప్టెన్ పోటీదారుల ను ఎంపిక చేసే టాస్క్ 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ ' లో గ్రీన్ టీమ్ అయినటువంటి శ్వేతా, లోబో , యాంకర్ రవి ఇంటి నియమాలను ఉల్లంఘించి బిగ్ బాస్ ఆస్తి అయినటువంటి కుషన్ లను కట్ చేసి బొమ్మ లను తయారు చేశారు. అదేవిధం గా సంచాలకులు గా పనిచేసినటువంటి సిరి, కాజల్ లు తమ ఇష్టం వచ్చినట్లు ఆటను ఆడి విమర్శలను ఎదుర్కొన్నారు.ఆ కారణంగా వారు కెప్టెన్ పోటీదారులాగా అనర్హులయ్యారు. అయితే వరస్ట్ పెర్ఫామర్ అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.



 తాజాగా విడుదలైన ఓ ప్రోమో వీడియోలో యాంకర్ రవిని విశ్వా వరస్ట్ పెర్ఫామర్ గా స్టాంప్ వేస్తె ఆ తరువాత వచ్చిన కాజల్ కూడా రవిని వరస్ట్ పెర్ఫామర్ కింద స్టాంప్ వేసింది. యాని మాత్రం వరస్ట్ పెర్ఫామర్ గా సిరిని ఎంచుకుంది. ఆ తరువాత వచ్చిన మానస్ కూడా సిరిని కి స్టాంప్ వేశాడు. అయితే వీరిద్దరిలో ఎవరు జైలు కి వెళతారని విషయమై అందరిలో సందిగ్ధం నెలకొంది. ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే ఇంటి సభ్యుల్లో యాంకర్ రవి, సిరి, ప్రియా, మానస్, సన్నీ, లోబో , కాజల్ , విశ్వా , శ్వేతలు ఉన్నారు. ప్రస్తుతం వచ్చిన లేటెస్ట్ ప్రోమో చూసిన తరువాత ఎవరు ఎలిమినేట్ అవుతారనే తీవ్ర ఉత్కంఠ ప్రస్తుతం ఏర్పడింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: