చరణ్ 16 మూవీ కూడా ఫిక్స్ ..... ??

GVK Writings
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మరొక నటుడు ఎన్టీఆర్ తో కలిసి చేసిన సినిమా ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా రాజమౌళి ఈ సినిమాని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఇక ఈ సినిమా తరువాత త్వరలో శంకర్ తీయనున్న మరొక బడా సినిమాలో చరణ్ యాక్ట్ చేయనున్న విషయం తెలిసిందే.
ఎంతో గ్రాండ్ గా రూపొందనున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందించనున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుపుకోగా ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాల అనంతరం యువ దర్శకడు గౌతమ్ తిన్ననూరి తో మెగాపవర్ స్టార్ ఒక యాక్షన్ బేస్డ్ ఎమోషనల్ డ్రామా మూవీ చేయనున్నారు అంటూ ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు వస్తుండగా, అది నిజమే అని, ఇప్పటికే చరణ్ కి ఒక అద్భుతమైన స్టోరీ వినిపించి అది ఆయనకు ఎంతో నచ్చడంతో కొన్నాళ్లుగా దాని స్క్రిప్ట్ పూర్తి చేసేపనిలో నిమగ్నమై ఉన్నారట గౌతమ్ తిన్ననూరి.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేయడంతో చరణ్ దగ్గరకు వెళ్లిదానిని వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారట గౌతమ్. ఎంతో భారీ స్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఎంతో కొత్తగా ఉంటుందని, అతి త్వరలో దీనికి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో మూవీ తీసే గొప్ప అవకాశాన్ని దర్శకుడు గౌతమ్ అందుకున్నట్లే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: