ఆ విషయంలో ప్రొడ్యూసర్స్ కి చుక్కలు చూయిస్తున్న బడా హీరోలు..?

VUYYURU SUBHASH

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే.. పాన్ ఇండియా లెవల్ సినిమా లు అంటూ ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యంగ్ హీరోల దగ్గర నుండి టాప్ సీనియర్ హీరోల వరకు అందరూ ఆ పాన్ ఇండియా సినిమాల మీదే పడుతున్నారు. ఎందుకంటే.. ఒక్క సినిమాతోనే వేరే భాషల్లో కూడా పాపులారిటీ వచ్చేస్తుంది. ఇక సినిమా హిట్ అయితే.. పక్క భాష ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ సెట్ చేసుకొవచ్చు. తద్వార రెమ్యూనరేషన్ పెంచుకోవచ్చు.
అందుకని ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలు సైతం ఈ పాన్ ఇండియా సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అంతేనా రెమ్యూనరేషన్ భారీగా పెంచేసి ప్రోడ్యూసర్స్ కి చుక్కలు చూయిస్తున్నారు. అయితే సినిమాల విషయంలో రెమ్యునరేషన్  ఎవరెవరు ఎంత భారీగా పెంచేసారు..ఎంత డిమాండ్ చేస్తున్నారో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

మహేష్ బాబు: చాలా సాఫ్ట్ గా..క్లాస్  గా కనిపించే టాలీవుడ్ రాజకుమారుడు..మహేష్ బాబు నిన్న మొన్నటి  వరకూ రూ.50 కోట్లు తీసుకుంటూ వచ్చి.. సర్కారు వారి పాట సినిమాకు మాత్ర, రూ.65 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.


ప్రభాస్: దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్..పారితోషకం రెండు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈయన ఒక్కో సినిమాకు  ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడట.
పవన్ కళ్యాణ్: ప్రజా సేవ అంటూ సినిమాలకు గుడ్ బై చెప్పేసి..మళ్లి మూవీస్ లోకి రీఎంట్రీ  ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే వకీల్ సాబ్ హిట్ టాక్ తో ఆయన కూడా రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడట. ప్రస్తుతం చేస్తున్న్ భీమ్లా నాయక్ సినిమాకు ఏకంగా 65 కోట్లు తీసుకుంటున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
 ఇక వీళ్లే కాదు రవి తేజ,రాం చరణ్,సాయి ధరం తేజ్,నాని,అల్లు అర్జున్,చిరంజీవి,నాగ చైతన్య,నాగార్జున అందరూ కూడా రెమ్యూనరేషన్ భారీగా పెంచేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: