సిద్ధార్థ్ 8 ఏండ్ల ఆక‌లిని తీర్చుకున్న‌ట్టేనా?

Dabbeda Mohan Babu
సిద్ధార్థ్ హీరోగా తెలుగు భాష లో చాలా సినిమా లు తీశాడు. తెలుగు తో పాటు త‌మిళ్ హింది భాష‌ల‌లో కూడా కొన్ని సినిమాలు తీశాడు. ముందుగా బాయ్స్ సినిమాలో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. దీని త‌ర్వాత తెలుగు లో అనేక సినిమాలు తీశాడు. ఒక హీరో గానే కాకుండా సింగ‌ర్ గా కూడా సిద్ధార్థ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడు. తెలుగు లో నువ్విస్తానంటే నేనొద్దంటానా, రంగ్ దే బ‌సంతి తో పాటు బొమ్మ‌రిల్లు సినిమా లు సూప‌ర్ హిట్ అయ్యాయి. బొమ్మ‌రిల్లు సినిమా ప‌లు అవార్డు ల‌ను కూడా గెలుచు కుంది. వీటి తో పాటు ఆట‌, కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం, ఓయ్ వంటి సినిమా లు కూడా చేశాడు. అలాగే 2006 లో వ‌చ్చిన చుక్క‌ల్లో చంద్రుడు సినిమా లో మొద‌టి సారి సింగ‌ర్ గా అవ‌తారం ఎత్తాడు.


ఇదీల ఉండ‌గా 2013లో జ‌బ‌ర్ధ‌స్త్ సినిమా లో హీరోగా న‌టించాడు. అయితే ఈ సినిమా పెద్ద‌గా రాణించ లేదు. దీని త‌ర్వాత సిద్ధార్థ్ మ‌ళ్లి తెలుగు సినిమా ల్లో క‌నిపించ‌లేడు. దాదాపు 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత మహా స‌ముద్రం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌హా స‌ముద్రం సినిమాలో హీరో శ‌ర్వానంద్ తో పాటు మ‌ల్టీ స్టార‌ర్ గా చేశాడు. ఈ సినిమా తాజా ఈ రోజు విడుద‌ల అయింది. ఈ సినిమా లో సిద్ధార్థ్ న‌ట‌న అద్భుతంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకు పోతుంది. ఈ సినిమా లో సిద్ధార్థ్ న‌ట‌న ను చూసి ఎన‌మిదేండ్లు ఆక‌లి తో ఉండి ప్రేక్ష‌కుల  ముందుకు వ‌చ్చాడ‌ని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ద్వారా హీరో సిద్ధార్థ్ కు మంచి క‌మ్ బ్యాక్ సినిమా అని సినిమా విశ్లేష‌కులు అంటున్నారు. అయితే మ హా స‌ముద్రం సినిమా హిట్ టాక్ రావ‌డం తో హీరో సిద్ధార్థ్ మ‌ళ్లి భారీగా అవ‌కాశాలు వ‌చ్చేట్టు ఉన్నాయ‌ని సిద్ధార్థ్ అభిమానులు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: