హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు.. వీరు కూడా సినిమా లో హైలైట్!!

P.Nishanth Kumar
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోగా ప్రేక్షకులను ఎంతగానో అలరించే చేసిన సినిమాగా ఇది నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో కథ చాలా బాగుంది దాని కంటే ఎక్కువగా నటీనటులు ఎమోషనల్ గా నటించి ప్రతి ఒక్క ప్రేక్షకుడుతో విజిల్స్ కొట్టించుకుంటున్నారు.

ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్లకు మాత్రమే ఎక్కువగా పేరు వస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో చేసిన ప్రతి పాత్ర కూడా హీరో హీరోయిన్లకు సమానంగా పేరు దక్కించుకున్నారు. ఆ విధంగా ఈ సినిమాలో హీరో లు మరియు హీరోయిన్ ల తర్వాత రెండు పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు . అవే చుంచు మామ మరియు గూని బాబ్జీ పాత్రలు. ఈ రెండు పాత్రల్లో మహామహులు నటించడం వల్లే ఈ పాత్రలకు ఎంతో గుర్తింపు దక్కింది అని చెప్పవచ్చు.  అజయ్ భూపతి కూడా ఈ పాత్రను డిజైన్ చేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా తీసుకుని తనదైన మార్కును ఈ పాత్రల ద్వారా కూడా చూపించాడు.

గూని బాబ్జి గా రావు రమేష్ జగపతిబాబు చుంచు మామ గా నటించగా వీరిద్దరూ తెలుగు పరిశ్రమ ఎప్పటికీ గుర్తుంచుకునే నటన ను ఈ సినిమా లో ప్రదర్శించారు. జగపతి బాబు విలన్ గా మారిన తర్వాత ఆయన రేంజ్ ఏ విధంగా మారిపోయిందో అందరికీ తెలిసిందే.  సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ముఖ్యమైన పాత్ర చేయాలంటే తానే కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఆయన తన ఇమేజ్  మార్చుకుని ఇప్పటివరకు చాలా పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించారు. చుంచు మామ పాత్ర ఆయన కెరీర్లోనే ఒక బెస్ట్ పాత్ర అని చెప్పుకోవచ్చు. అలాగే గూని బాబ్జి గా రావు రమేష్ నటన అసాధారణంగా ఉందని చెప్పవచ్చు. ఈ రెండు పాత్రలలో వీరు తప్ప వేరే ఎవరు లేరు అన్న రీతిలో నటించి సినిమా హిట్టు ప్రధాన కారణం అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: