పూజ హెగ్డే కు ఎ హీరో అంటే ఇష్టమో తెలుసా..?

Divya

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా, డాన్సర్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ది హీరోయిన్ పూజా హెగ్డే. ఇక ఈమె అందమే ఈమె సినిమాలలో నటించడానికి ముఖ్య కారణాలు చెప్పుకోవచ్చు. ఇక ఈమె చెప్పే మాట చిలక పలుకులు లాగ ఉండడంతో అభిమానులు ఈమెకు స్టార్ హీరోయిన్ హోదాని ఇచ్చారు. టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది పూజాహెగ్డే. ఇక అంతే కాకుండా ఇతర భాషలో సైతం నటిస్తోంది.
ఇక ఒకానొక సమయంలో ఒక సినిమా సక్సెస్ మీటింగ్ లో తనకి ఆ హీరో ఇష్టం అంటూ తెలియజేసింది ఈ  ముద్దుగుమ్మ. ఆ సినిమా ఏదో కాదు మహర్షి సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడుతూ అల్లరి నరేష్ ఒక సైలెంట్ యాక్టర్గా కనిపిస్తాడు. కానీ తను చాలా మంచి వ్యక్తి అని తెలియజేసింది. తనంటే నాకు ఒక మంచి స్నేహితుడు లాగా పరిచయమయ్యాడు అంటూ తెలియజేస్తోంది.
ఇక డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి తెలియజేస్తూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మహర్షి సినిమా ఒక పెద్ద సక్సెస్ చేసినందుకు తమ అభిమానులకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది పూజాహెగ్డే. రే సినిమాతోనే అమాంతం రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం."నాకు ఇష్టమైన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు"అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొస్తోంది.
మహేష్ బాబు 25 సినిమాలు చేసినా కూడా తన లుక్స్ లో ఎలాంటి మార్పు లేదు తన అందం లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొస్తోంది పూజా హెగ్డే. నాకు ఎన్ని సినిమాలు సక్సెస్ వచ్చినప్పటికీ కూడా నా కెరీర్లో ఇది ఒక పెద్ద సక్సెస్ సినిమాగా చెప్పుకుంటానని తెలియజేస్తోంది. అంతే కాకుండా మహేష్ బాబు తో నటించడానికి ఎటువంటి సినిమా అవకాశం వచ్చినా కూడా వదులుకోనని తెలియజేస్తోంది. ఏది ఏమైనా పూజ హెగ్డే మహేష్ బాబు అంటే ఇష్టం అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: