బిగ్ బి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ ర‌చ‌యిత‌

Dabbeda Mohan Babu
బిగ్ బి అమితాబ్ బ‌చ్చన్ గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. త‌న సినిమా ల‌తో దేశ వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బిగ్ బి. 79 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చినా.. సినిమా ల ఎంపిక అలాగే సినిమా చేయ‌డం వంటివి ఏమాత్రం త‌గ్గ కుండా చేస్తాడు. ఇంత వ‌య‌స్సు ఉన్న ఏడాదికి క‌నీసం మూడు సినిమా లు అయినా తీస్తు ఉంటాడు. అలాగే కొన్ని సినిమా ల్లో గెస్ట్ రోల్స్, ప్రాధ‌న్య‌త ఉన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ఈయ‌న తీసే సినిమా లు కూడా త‌న వ‌య‌స్సు ను ప‌రిగ‌ణ లోకి తీసుకుని దానికి అనుగూణ మైన క‌థ ల‌నే ఎంచు కుంటాడు. దీంతో పాటు యాడ్ లలో కూడా దూసుకు పోతారు. ఇప్ప‌టికి చాలా ప్ర‌యివేట్ కంపెనీల‌కు అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హరిస్తున్నారు. అలాగే ప్ర‌భుత్వ ప‌థ‌కాల ను ప్ర‌జ‌ల‌కు చేర వేసే యాడ్ ల‌లో ను న‌టిస్తారు. ఇలా ఎదో రకం గా ప్ర‌జ‌ల ముందు బిగ్ బి ఉంటునే ఉంటాడు.

అయితే ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్ మెగాస్టార్  బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ 79 వ పుట్టిన రోజు జ‌రుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా చాలా మంది న‌టీన‌టులు ఆయ‌న కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ తండ్రి ప్ర‌యుఖ ర‌చ‌యిత స‌లీం ఖాన్ బిగ్ బి కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే బిగ్ బి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బిగ్ బి వ‌య‌స్సు అయిపోయింద‌ని అన్నాడు. అలాగే ఆయ‌న సినిమా ల‌కు గుడ్ బై చెప్పాల‌ని అన్నారు. త‌న‌కు ఉన్న వ‌య‌స్సు  ను గౌర‌వించి ఈ నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించారు. ఆయ‌న జీవితం కావాల్సిన పేరు ను ఎప్పుడో సంపాధించార‌ని అన్నారు. ఇప్పుడు ఆయ‌న కు రెస్ట్ అవ‌స‌రం అని తెలిపారు. అయితే స‌లీం ఖాన్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చన్ తో దాదాపు 10 సినిమాలు చేశాడు. కాగ స‌లీం ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం బాలీవుడ్ లోచ‌ర్చ కు దారి తీస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్య‌ల పై ఇంకా బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్పందించ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: