టాలీవుడ్ డైలాగ్ కింగ్ ఎవరో తెలుసా?

VAMSI
స్టార్ హీరోల సినిమాలు అంటే ప్రేక్షకులకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డాన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, మంచి మెసేజ్ తో కూడిన చిత్రాలు, ఫైటింగ్స్, పంచ్ డైలాగ్స్ యాక్షన్ సన్నివేశాలు. ఇలా ఒక్కో హీరోపై వారి నటన అలాగే చిత్రాలను బట్టి కొన్ని కొన్ని స్పెషల్ ఇంట్రస్ట్ ఆడియన్స్ కి ఏర్పడుతుంటాయి. బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల చిత్రాల్లో ఎక్కువగా ప్రేక్షకులు పవర్ఫుల్ డైలాగ్స్ ను అదిరిపోయే పర్ఫార్మెన్స్ ను ఎక్సపెక్ట్ చేస్తుంటారు. చాలా వరకు ప్రేక్షకుల అంచనాలకు మించి యాక్షన్, డైలాగ్స్ అందిస్తూ తమ క్రేజ్ ను అలా పెంచేస్తుంటారు స్టార్స్. సినిమా సక్సెస్ కి కూడా డైలాగ్స్ అనేది కీలక పాత్ర పోషిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక అభిమాన తారల డైలాగ్స్ ను కలర్ టోన్ గా పెట్టుకోవడం, స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు దద్దరిలిళ్లేలా వారి హీరోల  డైలాగ్స్ ను పెట్టుకోవడం, సందర్భం వచ్చినప్పుడు ఆ డైలాగ్ ను చెప్పడం వంటివి చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు అభిమానులు. అయితే అంతగా ఆకట్టుకున్న మన స్టార్ హీరోల డైలాగ్స్ లో కొన్నిటిని ఒకసారి గుర్తుచేసుకుందాం పదండి.
* టాలీవుడ్ డైలాగ్ కింగ్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబు డైలాగ్స్ ఆయన వాయిస్ బేస్ ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డైలాగ్స్ చెప్పడంలో మోహన్ బాబు రూటే సెపరేటు. ఆయన ప్రత్యేకమైన శైలికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. ఆయన సినిమాల్లో ఫేమస్ అయిన డైలాగులు అంటే ఒకటా? వందా? ఎన్నో వేల డైలాగ్స్.
ఆయన సినిమాల్లో చెప్పిన ఫేమస్ డైలాగ్స్ ని ఒక చోట చేర్చి ఈ మధ్య పుస్తక రూపంలోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.  2016 లో ఆయన నట జీవితం లోకి అడుగుపెట్టి నలభై వసంతాలు  పూర్తి అయిన సందర్భంగా మోహన్ బాబు ఫేమస్ డైలాగ్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాటిలో ఎన్నో డైలాగుల సమాహారం ఉంది.  
 
* అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్ బాబు చెప్పే "అరిస్తే చరుస్తా.. చరిస్తే కరుస్తా.. కరిస్తే నిన్ను కూడా బొక్కలో ఏస్తా.." అనే డైలాగ్ ఇప్పటికీ అంతే ఫేమస్.
* పెదరాయుడు చిత్రంలో నీటిలోని చేపకు మనుషులకు బంధాన్ని తెలియచెప్పే డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయింది.
*రౌడీ మూవీలో మోహన్ బాబు చెప్పే, "పగ మనిషిని చంపేస్తుంది... ప్రేమ మనిషిని బ్రతికిస్తుంది" అనే డైలాగ్ బాగా ప్రజల్లోకి వెళ్ళింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: