లైఫ్ లో మీరు మరిచిపోలేని డైలాగ్స్ ఇవే?

VAMSI
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాష గొప్పతనం గురించి  తెలుగంటే గోంగూర..తెలుగంటే వెటకారం..అంటూ  సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంలో పాట రూపంలో ఎంతో చక్కగా అందంగా చెప్పారు. మరి అలాంటి అద్భుతమైన తెలుగులో అదిరే పోయే డైలాగులు చెబితే ఇంకెంత అదిరిపోతుంది. సినిమాల్లో హీరోలు పవర్ఫుల్ డైలాగులు చెబుతుంటే స్క్రీన్ ముందు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ రంగురంగుల పేపర్లు విసురుతూ తెగ ఎంజాయ్ చేస్తారు. తెలుగులో ఎంతగానో ఫేమస్ అయిన  డైలాగ్స్ లో కొన్నిటిని ఓ సారి అలా చూద్దాం..
"ఎవడు కొడితే  దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు" పోకిరి చిత్రంలో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ కి రెస్పాన్స్ ఓ రేంజ్ లో వచ్చింది. నిజంగానే ఆడియన్స్ మైండ్ సంతోషంతో బ్లాక్ అయింది. అలాగే ఇదే చిత్రం లో మరో డైలాగ్.... "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" అనే మహేష్ డైలాగ్ ఆ చిత్రంలో మరో సూపర్ హిట్ డైలాగ్ గా గుర్తింపు పొందింది.
మగధీర సినిమాలో రాంచరణ్ డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. "ఒక్కొకర్ని కాదు షేర్ ఖాన్ ఒకేసారి వంద మందిని పంపించు" అనే డైలాగ్ సినిమాకి చాలా ప్లస్ అయింది.
ఇక గబ్బర్ సింగ్ చిత్రంలో మన పవర్ స్టార్ డైలాగ్స్ తో కేకపుట్టించారు. "నాక్కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది" ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది.
టెంపర్ సినిమాలో "నీకు ఇగో లోపల ఉంటుందేమో నాకు నా చుట్టు  వైఫైలా ఉంటుంది" అన్న తారక్ డైలాగ్ ఆ సన్నివేశాన్ని సినిమాకే హైలెట్ గా చేశాయి.
ఇలా ఎన్నో పవర్ ఫుల్ మాస్ మరియు క్లాస్ డైలాగులు తెలుగు సినిమాలలో వచ్చి ప్రేక్షకులను అలరించాయి. పైన మనము చెప్పుకున్న డైలాగులు మన లైఫ్ లో మరిచిపోలేనివి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: