రెబ‌ల్ మూవీ లో ప్ర‌భాస్ డైలాగ్స్ సూప‌ర్

Dabbeda Mohan Babu
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరో గా రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన సినిమా రెబ‌ల్. ఈ సినిమా అంచ‌నాలు త‌గి న‌ట్టు రాణించ‌క లేక పోయింది. కానీ ఈ సినిమా లో కొన్ని డైలాగ్స్ రెబ‌ల్ సినిమా కు కాస్త ప్ల‌స్ అయ్యాయి. ఈ సినిమా కు డైలాగ్స్ ల‌ను డార్లింగ్ స్వామి రాసాడు. అలాగే అలాగే ఈ సినిమా కు క‌థ ను అందించింది ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది డాన్స్ కొరియోగ్రఫీ ని చేసింది రాఘ‌వ లారెన్స్. లారెన్స్ ఒక్క‌డె ఈ సినిమా అన్ని అయి తీశాడు. అలాగే ఈ సినిమా లో ప్ర‌భాస్ తండ్రి పాత్ర లో రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజ్ న‌టించారు. వీటి అన్నింటి వ‌ల్ల రెబ‌ల్ సినిమా కు అంచ‌నాలు చాలా పెరిగాయి. కానీ ఈ సినిమా అంచ‌నాల‌ను త‌ల కిందులు చేస్తు బాక్సాఫీస్ వ‌ద్ద బోర్ల ప‌డింది. కానీ ఈ సినిమా ప్ర‌భాస్ చెప్పిన డైలాగ్స్ మాత్రం చాలా పాపుల‌ర్ అయ్యాయి.


ఇప్పుడు ఆ డైలాగ్స్ ల‌ను చూద్దం. నేను య‌ముడు రూపం లో వ‌చ్చిన రెబ‌ల్ ను.. అంటు ప్ర‌భ‌స్ చెప్పిన డైలాగ్ ఇప్ప‌టికి చాలా క్రేజ్ లోనే ఉంది. అలాగే అమ్మాయిల‌ను ఉద్ధేశించి చెప్పిన డైలాగ్ కూడా చాలా పాపుల‌ర్ అయింది. నాకు అమ్మాయిలు అన్న సెల్ ఫోన్ లు అన్న పెద్ద‌గా ఇష్టం ఉండ‌వు. సెల్ ఫోన్ లో మెసెజ్ లు ఎక్కువ.. అమ్మాయిల్లో డౌట్స్ ఎక్కువ‌. అందుకే ఇవి రెండు మ‌న‌కు సెట్ కావ‌ని ప్ర‌భాస్ చెబుతాడు. ఈ డైలాగ్ ఇప్పుటికి కూడా ఈ డైలాగ్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. అలాగే నాకు రామాయాణం మ‌హా భార‌తం వంటి క‌థ ల గురించి తెలియ‌దు. కానీ అందులో ఉన్న యుద్ధాల గురించి చాలా బాగా తెలుసు. రండి కుమ్మెసుకుందాం అంటు ప్ర‌భాస్ విల‌న్ ల‌ను ఉద్ధేశించి చెబుతాడు. ఈ డైలాగ్ కూడా అప్ప‌ట్లో చాలా ఫేమ‌స్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: